ఒకే ప్రొడక్షన్ లో ఎన్టీఆర్.. రెండు భారీ ప్రాజెక్ట్స్..?
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఆయన ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఆల్రెడీ వార్ 2 పూర్తి చేసిన తారక్ ఆ సినిమాతో ఆగష్టు 14న రాబోతున్నాడు.
By: Tupaki Desk | 27 July 2025 5:00 AM ISTమాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఆయన ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఆల్రెడీ వార్ 2 పూర్తి చేసిన తారక్ ఆ సినిమాతో ఆగష్టు 14న రాబోతున్నాడు. వార్ 2 పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పనుల్లో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు పూర్తి సపోర్ట్ అందిస్తున్నాడట. ఆ సినిమా షూటింగ్ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందట. ఐతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయ్యాక నెక్స్ట్ త్రివిక్రం లైన్ లో ఉన్నాడు.
ఎన్టీఆర్ త్రివిక్రం కాంబో సినిమా వెరైటీ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే ఎన్టీఆర్ మురుగన్ బుక్ తో కనిపించే సరికి త్రివిక్రం సినిమా కోసం తారక్ ప్రిపేర్ అవుతున్నాడని అనుకుంటున్నారు. ఐతే గురూజీ ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడు అన్నది ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రం తారక్ సినిమా కన్నా ముందు వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడని టాక్.
వెంకటేష్ తో సినిమా పూర్తి చేశాకే గురూజీ ఎన్టీఆర్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. బీస్ట్, జైలర్ సినిమాలతో తన సత్తా చాటిన నెల్సన్ ఎన్టీఆర్ కి ఒక అదిరిపోయే కథ చెప్పాడట. ఆ సినిమా త్రివిక్రం సినిమా తర్వాత ఉంటుందని టాక్.
ఐతే స్పెషల్ న్యూస్ ఏంటంటే త్రివిక్రం, నెల్సన్ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ లో చేస్తున్నాడత ఎన్టీఆర్. సితార బ్యానర్ లోనే త్రివిక్రం, ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. త్రివిక్రం డైరెక్షన్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా అది ఉండబోతుందట. ఆ నెక్స్ట్ నెల్సన్ సినిమా కూడా సితార బ్యానర్ లోనే తెరకెక్కిస్తారని తెలుస్తుంది. దీని గురించి నిర్మాత నాగ వంశీ స్వయంగా వెల్లడించారు. సో ఎన్టీఆర్ తో రెండు సినిమాలు అది కూడా భారీ ప్రాజెక్ట్ లుగా ఈ మూవీస్ రాబోతున్నాయి. సో ఈ సినిమాలు వస్తే.. సితార బ్యానర్ పేరు పాన్ ఇండియా రేంజ్ మారిమోగిపోవడం పక్కా అని చెప్పొచ్చు. వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్.. రాబోయే సినిమాలతో కూడా పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసే ప్లాన్ లో ఉన్నారని చెప్పొచ్చు.
