తారక్ 'డ్రాగన్'.. అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం టాలీవుడ్‌లో హైప్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ టాప్‌లో ఉంటుంది.
By: Tupaki Desk | 17 April 2025 7:20 AMప్రస్తుతం టాలీవుడ్‌లో హైప్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ టాప్‌లో ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది ఒకటి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ఎన్టీఆర్‌తో చేస్తున్న ఫస్ట్ డైరెక్షన్ కావడంతో అంచనాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంటెన్స్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అని పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి ఎంపికైనట్లు సమాచారం. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ తన కేజీఎఫ్, సలార్ సినిమాలకు పనిచేసిన మేజర్ టెక్నీషియన్స్‌ను ఈ సినిమాకూ కొనసాగిస్తున్నారు. వీటన్నింటి మీదే సినిమా స్కేలు ఎలా ఉంటుందో అర్థమవుతోంది.
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ నెల 22న ఎన్టీఆర్ షూట్‌కి జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకధాటిగా మూడు వారాల పాటు కొనసాగనున్న ఈ షెడ్యూల్ మే 15న పూర్తవుతుంది. ఇందులో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించబోతున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం సినిమాలో హైలైట్ కానుందట. ఎంతో గట్టి ప్రిపరేషన్ తర్వాతే దీనిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేసారని సమాచారం. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్‌తో పాటు బరువు కూడా తగ్గించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటుగా ఎన్టీఆర్ ప్రస్తుతం మరో హై బడ్జెట్ మూవీ వార్ 2లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్ యాక్షన్ యూనివర్స్‌లో అడుగుపెడుతున్న ఎన్టీఆర్, ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న ఆ సినిమా విడుదల కానుంది. అలాగే ‘డ్రాగన్’ సినిమాను సంక్రాంతి 2026కి ప్లాన్ చేసినా, ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. దీంతో వేసవికి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్ గా హై లెవెల్‌లో ఉండే ఈ సినిమా ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయం. ఇక ‘డ్రాగన్’ టైటిల్ ఫిక్స్ అయితే, త్వరలోనే టైటిల్ గ్లింప్స్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.