తారక్ కొత్త ఇంటి సొగసు చూసారా?
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ ఇంటిని కూడా రెనోవేట్ చేసారు. ఈ భవంతి ఇప్పుడు సరికొత్త లుక్ తో వైబ్రేంట్ గా మారింది.
By: Tupaki Desk | 26 July 2025 10:32 AM ISTతారలు రెనోవేషన్ తో తమ గృహాలకు కొత్త సొబగులు అద్దుతున్నారు. ఇంతకుముందు జూబ్లీహిల్స్ లో రెనోవేషన్ చేసిన ఇంట్లోకి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ షిఫ్టయింది.
ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ ఇంటిని కూడా రెనోవేట్ చేసారు. ఈ భవంతి ఇప్పుడు సరికొత్త లుక్ తో వైబ్రేంట్ గా మారింది. భారీ భవంతిలో అడుగడుగునా తారక్- ప్రణతి జంట అభిరుచి మేరకు ఇంటీరియర్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలిసింది. ఫ్లోరింగ్ సహా వాల్ డెకరేషన్, షాండ్లియర్స్ , ఇంట్లో పడకగదులు, ఇలా ప్రతిదీ అధునాతన సాంకేతికతతో రెనోవేట్ చేసారని తెలిసింది. ఈ కొత్త ఇంట్లోకి తారక్ ఫ్యామిలీ షిప్టయిన సందర్భంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా సందడి చేసారు.
ప్రస్తుతం తారక్ ఇంటికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. కొన్ని నెలల పాటు ఈ పునరుద్ధరణ పనులు కొనసాగాయని తెలిసింది. దీనికోసం భారీగానే పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టులో విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ లో విడుదలవుతుంది. కొరటాల శివతో దేవర 2, త్రివిక్రమ్ తో ఓ సినిమా, ఎల్సన్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
