ఆ మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్..!
ఐతే ఇలాంటి మల్టీస్టారర్స్ మళ్లీ మళ్లీ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అయితే ఆ ఫ్యామిలీ హీరోలు కలిసి చేస్తే చూడాలని ఆశిస్తున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 4:11 AMటాలీవుడ్ లో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోలు తమ అభిమానులను మెప్పించే కథలతో పాటు మల్టీస్టారర్ సినిమాలకు కూడా ఓకే అనేస్తున్నారు. స్టార్ మల్టీస్టారర్ లో ఏ హీరో డామినేషన్ ఉంటుంది. ఆ టైం లో ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలన్న సమీకరణాలు చాలా ఉంటాయి. ఐతే ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయంలో జక్కన్న దీన్ని బాగా బ్యాలెన్స్ చేశాడు. భీం పాత్రలో తారక్ ని రామరాజు పాత్రలో చరణ్ ని చక్కగా చూపించాడు.
ఐతే ఇలాంటి మల్టీస్టారర్స్ మళ్లీ మళ్లీ రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అయితే ఆ ఫ్యామిలీ హీరోలు కలిసి చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. రామలక్ష్మణులు అంటే వీరిద్దరే అన్నట్టుగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు చూపిస్తుంటారు. ఎన్టీఆర్ కి అన్న కళ్యాణ్ రామ్ అంటే చాలా ఇష్టం.
కళ్యాణ్ రామ్ కూడా తారక్ ని నాన్నా నాన్న అంటూ ముద్దు చేస్తాడు. ఐతే తెర మీద ఈ ఇద్దరు అలా ఒక సినిమాలో కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే అది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా లేదు. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత దేవర 2 లైన్ లో ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ లో చేసిన వార్ 2 కూడా రిలీజ్ అవబోతుంది.
సో ఎన్టీఆర్ తో కొత్త సినిమా అది కూడా కళ్యాణ్ రామ్ తో అంటే ఇప్పుడు కుదిరే పని కాదు. కళ్యాణ్ రామ్ కూడా ఈమధ్యనే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఏంటన్నది క్లారిటీ రాలేదు. ఇప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్ లో అయినా అటు ఎన్టీఆర్ ఇటు కళ్యాణ్ రామ్ ఇద్దరికి పర్ఫెక్ట్ కథ అనిపించినప్పుడు ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలో బాలయ్య కూడా క్యామియో ఇస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. అలాంటి సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే సరైన కథ దొరికితే మాత్రం అది సాధ్యమవుతుందని చెప్పొచ్చు.