Begin typing your search above and press return to search.

హృతిక్‌ని ముప్పుతిప్ప‌లు పెట్టే స్టెప్పులు?

అయితే ఇప్పుడు డ్యాన్సుల ప‌రంగా, మ‌రో కొత్త జోడీని భార‌త‌దేశంలోని ప్ర‌జ‌లు గుర్తించ‌బోతున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2025 11:00 PM IST
హృతిక్‌ని ముప్పుతిప్ప‌లు పెట్టే స్టెప్పులు?
X

భార‌త‌దేశంలో అత్యంత ఫ్లెక్సిబుల్ గా బ్రేక్ డ్యాన్సులు చేయ‌గ‌లిగే స్టార్లు కొంద‌రు మాత్ర‌మే ఉన్నారు. ఆ కొంద‌రిలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి అంద‌రినీ ఆక‌ర్షించే డ్యాన్సింగ్ స్టార్స్. అటు బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాఫ్ లాంటి అరుదైన డ్యాన్సింగ్ స్టార్స్ ప్ర‌తిసారీ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ 'నాటు నాటు'తో చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ డ్యాన్సింగ్ సామ‌ర్థ్యం ఎలాంటిదో, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. టాలీవుడ్ నుంచి గ్రేట్ డ్యాన్సింగ్ స్టార్స్ గా ఆ ఇద్ద‌రికీ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. 'నాటు నాటు..' కోసం ఊర మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేసారు ఈ జోడీ. ఇక 'వార్ 2'లో నాటు నాటును మించే కాంపిటీటివ్ సాంగ్ ఉంటుంద‌నేది ఒక గుస‌గుస‌. హృతిక్- టైగ‌ర్ జోడీ కూడా డ్యాన్సుల్లో గురుశిష్యుల‌ను త‌లపిస్తార‌ట‌. ఆ ఇద్ద‌రి ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్, నృత్యం, యాక్ష‌న్ సీన్స్ విప‌రీతంగా మాస్ ని థియేట‌ర్ల‌కు లాగుతాయ‌ని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు డ్యాన్సుల ప‌రంగా, మ‌రో కొత్త జోడీని భార‌త‌దేశంలోని ప్ర‌జ‌లు గుర్తించ‌బోతున్నారు. ఈ జోడీ మ‌రెవ‌రో కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్. ఈ జోడీ క‌లిసి ఒకే ఫ్రేమ్ లో డ్యాన్సులు చేస్తుంటే చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వ‌ని అంటున్నారు. ఈ దృశ్యం వార్ 2 తో సాధ్య‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం హృతిక్, ఎన్టీఆర్ జోడీపై ఒక మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. దీనికోసం సెట్లు కూడా వేసారు. ఈ సెట్ లో హృతిక్, తార‌క్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ డ్యాన్సులు చేస్తున్నార‌ట‌. అయితే హృతిక్ ఎంత క్లాస్సీ స్టెప్పులతో ఆక‌ట్టుకున్నా అత‌డి వ‌య‌సు ఇప్పుడు 51. ఇది చాలా లేట్ ఏజ్.

అందువ‌ల్ల 42లో ఉన్న తార‌క్ స్పీడ్ ముందు అత‌డు రేసులో నిల‌బ‌డ‌తాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి. వార్ 2 ఈ ఏడాది ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. 90శాతం టాకీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ సైమ‌ల్టేనియ‌స్ గా సాగుతోంది. ఇందులో హృతిక్ రా ఏజెంట్ గా న‌టిస్తుండ‌గా, ఏజెంట్లంద‌రినీ ముప్పు తిప్ప‌లు పెట్టే విల‌న్ గా ఎన్టీఆర్ న‌టిస్తుండ‌డం ఎగ్జ‌యిట్ చేస్తోంది.