Begin typing your search above and press return to search.

హృతిక్ కన్నా తారక్ కు ఎక్కువే.. కానీ ఓ ట్విస్ట్!

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న వార్-2ను భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మించారు.

By:  Tupaki Desk   |   27 July 2025 8:00 PM IST
హృతిక్ కన్నా తారక్ కు ఎక్కువే.. కానీ ఓ ట్విస్ట్!
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో వార్-2 మూవీ రూపొందిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వార్ కు సీక్వెల్ గా రాబోతున్న ఆ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బీటౌన్ క్రేజీ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్ గా కనిపించనున్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న వార్-2ను భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆ సినిమాతోనే మన తారక్.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అక్కడ వేరే లెవెల్ హిట్ అవ్వగా.. ఇప్పుడు డైరెక్ట్ హిందీ మూవీతో సందడి చేస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. నిజానికి టీజర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ రాగా.. ట్రైలర్ తో అంతా సెట్ చేశారు మేకర్స్. ఇంకాస్త సూపర్ ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తే చాలు.. రజినీ కూలీ మూవీకి ఉన్న హైప్ తో ఈక్వెల్ హైప్ రావడం పక్కా.

ఏదేమైనా ఆగస్టు 14వ తేదీన విడుదల కానున్న వార్-2 సినిమా కోసం అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్స్ కోసం జోరుగా చర్చ సాగుతోంది. హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ ఎక్కువ పారితోషకం తీసుకున్నారని వినికిడి.

రూ.400 కోట్ల బడ్జెట్ తో వార్-2 మూవీ రూపొందిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్పై మూవీకి పెట్టిన హైయ్యెస్ట్ బడ్జెట్ ఇదేనని టాక్ వినిపిస్తోంది. యష్ ఫిల్మ్స్ ఏ స్పై సినిమాకు అంత ఖర్చు చేయలేదట. ఇప్పటి వరకు అత్యధికంగా.. టైగర్-3కు రూ.350 కోట్లను బడ్జెట్ గా పెట్టిందని సమాచారం.

అయితే వార్-2 మూవీకి గాను జూనియర్ ఎన్టీఆర్ రూ.70 కోట్లు అందుకున్నారని టాక్ వినిపిస్తోంది. హృతిక్ రోషన్ రూ.50 కోట్లు తీసుకున్నారని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ తీసుకునే ఒప్పందం కుదుర్చుకున్నారని సమచారం. కియరా రూ.15 కోట్లు, అయాన్ ముఖర్జీ రూ.30 కోట్లు అందుకున్నారని తెలుస్తోంది. పారితోషికాలు కాకుండా సినిమా ప్రొడక్షన కాస్ట్ రూ.220 కోట్లు అంట. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.