Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ X హృతిక్ రోషన్.. వార్-2 ట్రైలర్ చూశారా?

ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. . హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   25 July 2025 10:55 AM IST
ఎన్టీఆర్ X హృతిక్ రోషన్.. వార్-2 ట్రైలర్ చూశారా?
X

బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వార్-2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వార్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్-2కు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో 2025 ఆగస్టు 14వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా నిర్మాత నాగవంశీ.. వార్-2ను విడుదల చేయనున్నారు.

అయితే మూవీ అప్డేట్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తారక్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. . హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.

"నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని వదిలేసి నీడగా మారిపోతాను.." అంటూ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చారు. "నేను మాటిస్తున్నాను.. ఎవరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను.. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను" అంటూ తారక్ సీరియస్ లుక్ ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు.

"మిత్రులైనా సర్.. ఆప్తులైనా సరే.. పట్టించుకోను.. వెనకడుగు వేయకుండా వెళ్లిపోతాను" అంటూ హృతిక్ చెప్పగా.. "మంచి, చెడు, పాపం, పుణ్యం, తప్పు, ఒప్పు.." అంటూ పవర్ పుల్ డైలాగ్ చెప్పారు తారక్. అలా ఇద్దరూ పోటీ పడుతూ కనిపించారు. ఇండియా ఫస్ట్ అంటూ నినదించారు. భారీ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ముగిసింది.

అయితే ట్రైలర్ లో హృతిక్, తారక్.. పోటీపడి మరీ నటించినట్లు కనిపించారు. ఇద్దరూ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ తెచ్చారు. తారక్ తన యాక్టింగ్ తో ఫిదా చేశారు. కియారా అటు సీరియస్ లుక్ లో.. ఇటు బికినీ లుక్ లో సందడి చేశారు. ఇద్దరు హీరోలకు ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం వేరే లెవల్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డైలాగ్స్ అదిరిపోయాయి. మరి ఫుల్ యాక్ష‌న్ ప్యాక్‌ డ్‌ గా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మరి మీరు ట్రైలర్ ను చూశారా?