Begin typing your search above and press return to search.

హృతిక్-తార‌క్ మ‌ధ్య అస‌లైన యుద్దం ఫిక్సైందా!

దీంతో ఆ పాట చిత్రీక‌ర‌ణ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. తార‌క్ పై స‌న్నివేశాల చిత్రీ క‌ర‌ణ పూర్తి కావ‌డంతో హైద‌రాబాద్ కి వ‌చ్చేసాడు.

By:  Tupaki Desk   |   10 May 2025 11:36 AM
fter RRRs Naatu Naatu, NTR Gears Up for Dance Duel with Hrithik in WAR 2
X

హృతిక్ రోష‌న్- ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్స‌ర్లు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటి టాప్ డాన్సర్ల మ‌ధ్య `వార్ 2`లో ఓ సాంగ్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ స్పెష‌ల్ సాంగ్ డిజైన్ చేసా రు. మార్చిలో ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌నుకున్నారు. స‌రిగ్గా రిహార్స‌ల్స్ చేస్తోన్న స‌మ‌యంలో హృతిక్ కాలికి గాయ‌మైంది. దీంతో ఆ పాట చిత్రీక‌ర‌ణ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. తార‌క్ పై స‌న్నివేశాల చిత్రీ క‌ర‌ణ పూర్తి కావ‌డంతో హైద‌రాబాద్ కి వ‌చ్చేసాడు.

అప్ప‌టి నుంచి ఆ పాట చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డుతుంది. ఆ పాట కోసం తార‌క్ మ‌ళ్లీ ముంబై వెళ్తాడ‌ని ప్ర‌చా రం జ‌రుగుతోంది కానీ ఇంత వ‌ర‌కూ అది జ‌ర‌గ‌లేదు. అయితే ఈ సాంగ్ షూట్ జూన్ లో ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌తిష్టాత్మ‌క య‌శ్ రాజ్ స్టూడియోలోనే ఈపాట‌ చిత్రీక‌రణ‌కు సంబంధించి ఏర్పాట్లు జ‌రుగు తున్నాయి. ఈ సాంగ్ షూట్ పూర్త‌యితే తార‌క్ పూర్తిగా రిలీవ్ అయిన‌ట్లే. మ‌ళ్లీ డ‌బ్బింగ్ చెప్పే స‌మ‌యం లోనే ముంబై వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే అదే నెల‌లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మొత్తం టాకీ పూర్తవుతుంద‌ని స‌మాచారం. ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం మూడు కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారుట‌. య‌శ్ రాజ్ స్టూడియోస్ లో భారీ సెట్లు వేస్తు న్న‌ట్లు స‌మాచారం. ఈ సాంగ్ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. హృతిక్ తో తార‌క్ త‌ల‌ప‌డం ఇదే తొలిసారి. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి నాటు నాటు పాట‌కు డాన్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ పాట సూప‌ర్ హిట్ అయింది. ఆ పాట‌కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వ‌చ్చింది. ఇప్పుడు హృతిక్ రోష‌న్ తో చేసే సాంగ్ అంత‌కు మించి హైలైట్ అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి. హృతిక్ రోష‌న్ ఇండి యా లోనే గ్రేట్ డాన్స‌ర్. బాలీవుడ్ న‌టులంతా హృతిక్ డాన్సుకు ఫిదా అవుతుంటారు. మ‌రి ఆయ‌న డాన్సు గురించి తార‌క్ ఏమంటాడో చూడాలి.