ఎన్టీఆర్-హృతిక్ మధ్య వార్ సృష్టికర్త బాస్కోమార్టిన్!
నాటు నాటు పాట రేంజ్ లో ఇద్దరు పేస్ టూ పేస్ డాన్సులో పోటాపోటీగా కనిపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారుతుంది.
By: Tupaki Desk | 2 July 2025 1:33 PM IST`వార్ -2` లో హృతిక్ రోషన్ -ఎన్టీఆర్ మధ్య భారీ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో రెండు పాత్రల మధ్య తగ్గాప్ వార్ కనిపిస్తుంది. కానీ అంతకు మించిన మరో వార్ ఇద్దరి మద్య డాన్స్ అన్నది అందరూ భావిస్తోన్న అంశం. నాటు నాటు పాట రేంజ్ లో ఇద్దరు పేస్ టూ పేస్ డాన్సులో పోటాపోటీగా కనిపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారుతుంది.
నిన్నటి నుంచే పాట షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ పాటకు ఎవరు కొరియోగ్రఫీ చేస్తున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఆ కొరియోగ్రాఫర్ ఎవరు? అన్నది లీక్ అయింది. బాస్కో మార్టిన్ కంపోజ్ చేస్తున్నట్లు తేలింది. ఇతడు కొరియోగ్రఫీలో చాలా సీనియర్. బాలీవుడ్ లో చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసాడు. ఇతడితో పాటు సీజర్ అనే మరో కొరియోగ్రఫర్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి పని చేస్తుంటారు.
బోస్కో మార్టిస్ - సీజర్ గోన్సాల్వ్స్ . ఇద్దరు ఇప్పటి వరకూ 200 పాటలకు కొరియోగ్రఫీ చేసారు. దాదాపు 75 చిత్రాలకు పనిచేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వీళ్లకి ప్రఖ్యాత డాన్సు స్టూడియో కంపెనీలు కూడా ఉన్నాయి. జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఇంకా దేశంలో మరిన్ని అవార్డలు కూడా వీళ్ల ఖాతాలో ఉన్నాయి. బోస్కో-సీజర్ ద్వయం ఫరా ఖాన్ బ్యా కప్ డ్యాన్సర్ల గా కెరీర్ ప్రారంభించారు.
అటుపై పలు డాన్సు షోస్ చేసారు. మ్యూజిక్ వీడియోలు చేసారు. ఈ సమయంలో ఓ సందర్భంలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో ఓ యాడ్ కోసం పనిచేసే అవకాశం లభించింది. అటుపై 2000 లో విధు వినోద్ చోప్రా `మిషన్ కాశ్మీర్` తో కొరియోగ్రాఫర్లగా తెరంగేట్రం చేసారు. అయితే 2016 లో ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారు సొంతంగా పని చేస్తున్నారు.
