వార్ 2 కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్!
ఇండియా వైడ్‌గా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ స్పై యాక్షన్ డ్రామా 'వార్ 2'. ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By: Tupaki Desk | 11 Jun 2025 1:55 PM ISTఇండియా వైడ్‌గా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ స్పై యాక్షన్ డ్రామా 'వార్ 2'. ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ పవర్ ఫుల్‌క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీని అయాన్‌ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని 2019లో వచ్చిన 'వార్'కు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. హృతిక్‌ని వెంటాడే క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్‌లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ విషయాన్ని ఇప్పటికే హృతిక్, ఎన్టీఆర్ బయటపెట్టేశారు.
భారీ అంచనాలు నెలకొన్న ఈ స్పై డ్రామాని అత్యంత భారీ స్థాయిలో ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో వీఎఫ్ ఎక్స్‌ని వినియోగించారట. ఈ సన్నివేశం స్క్రీన్‌పై ఓ రేంజ్‌లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల కథనం. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన క్యారెక్టర్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులని మొదలు పెట్టాడు.
దీనికి సంబంధించిన ఓ వీడియోని మేకర్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మెట్లు దిగుతూ వచ్చిన ఎన్టీఆర్ డబ్బింగ్ స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయని తెలిసింది. దీంతో డ్యాన్స్‌కు మాస్టర్స్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, హృతిక్‌ల కలయికలో ఫ్లోర్ అదిరిపోయే స్టెప్పులతో ఒక్క సాంగ్ అయినా ఉంటుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
