వార్2 కోసం మరోసారి ముంబైకి తారక్?
దేవర సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఆ తర్వాత వార్2 సినిమా కోసం చాలానే టైమ్ కేటాయించిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 2:30 AMదేవర సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఆ తర్వాత వార్2 సినిమా కోసం చాలానే టైమ్ కేటాయించిన విషయం తెలిసిందే. వార్2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి నటించాడనే సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో పాటూ హృతిక్ రోషన్ తో కలిసి చేయబోయే సీన్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటోంది వార్2.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 కోసం ఎన్టీఆర్ నెక్ట్స్ వీక్ నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడని తెలుస్తోంది. వార్2 పాన్ ఇండియా లెవల్లో రిలీజవుతున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పబోతున్నాడని అంటున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పెషల్ గా ఎన్టీఆర్- హృతిక్ ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్స్ ను తీశారని కూడా సమాచారం.
వార్2 లో హృతిక్ క్యారెక్టర్ కు సమానంగా ఎన్టీఆర్ పాత్రను కూడా అయాన్ డిజైన్ చేశాడని ఎప్పట్నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఫిల్మ్ ను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.