ఎన్టీఆర్ నీల్ మూవీలో బాలీవుడ్ భామ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది దేవర సినిమాతో బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 12 May 2025 1:44 PMమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది దేవర సినిమాతో బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేవరతో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎన్టీఆర్ ఆ సినిమాకు సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. కానీ దానికంటే ముందే ఎన్టీఆర్ మరో రెండు సినిమాలతో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. అందులో ఒకటి వార్2 కాగా, రెండోది డ్రాగన్.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వార్2. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేశాడు. వార్2 సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో వార్2 సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ అందరికీ దానిపై మంచి ఆసక్తి నెలకొంది.
ఇక రెండోది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా. ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
డ్రాగన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఓ కీలక పాత్రలో నటించనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ లో వచ్చే ఆమె పాత్ర సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఆల్రెడీ కన్నడ భామ రుక్మిణి వసంత్ ను తీసుకున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సడెన్ గా శ్రద్ధా కపూర్ పేరు వినిపించడంతో ఏ వార్త నిజమని కొందరు అయోమయంలో పడితే, మరికొందరు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరు రుక్మిణి వసంత్ కాగా, మరొకరు శ్రద్ధా కపూర్ అయుండొచ్చని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఏదీ నమ్మడానికి లేదు.