బాలీవుడ్ వైపు ఎన్టీఆర్ బలమైన అడుగులు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడి వడిగా బలమైన అడుగులు వేస్తున్నాడా? అంటే జరుగుతున్న పరిణామాలు, తను అంగీకరించిన ప్రాజెక్ట్‌లు ఇది నిజమేనని తేల్చి చెప్పేస్తున్నాయి.
By: Tupaki Desk | 17 May 2025 2:00 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడి వడిగా బలమైన అడుగులు వేస్తున్నాడా? అంటే జరుగుతున్న పరిణామాలు, తను అంగీకరించిన ప్రాజెక్ట్‌లు ఇది నిజమేనని తేల్చి చెప్పేస్తున్నాయి. జక్కన్న తెరకెక్కించిన `RRR`తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ని దక్కించుకోవడం తెలిసిందే. ఈ మూవీతో హాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నెసినట్టుగా తెలుస్తోంది. తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌పై దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్‌లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయినా యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ బిజినెస్ పరంగానూ వార్తల్లో నిలుస్తోంది.
ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్న ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా యష్ రాజ్ ఫిలింస్‌లో `వార్ 2`ని అంగీకరించే సమయంలోనే భారీ ఒప్పందంపై ఎన్టీఆర్ సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్ మరో సినిమా కూడా చేయడం ఖాయమన్నమాట.
`వార్ 2` తరువాత ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా తెరపైకి రానున్న సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, మేడ్ ఇన్ ఇండియా` పేరుతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్‌ని రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తారని, దీనికి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇదే కథతో అమీర్‌ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో ఓ సినిమాకు రూపకల్పణ జరుగుతోందని, `సితారే జమీన్ పర్ రలీజ్ తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా ఉంటే త్వరలో కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లోనూ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందని, త్వరలోనే ఇది జరుగుతుందని కూడా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు విన్న ఎన్టీఆర్ అభిమానులు సర్‌ప్రైజ్ ఫీలవుతున్నారు. `RRR` ఎన్టీఆర్ ప్లానింగ్ మొత్తం మారిందని, దేశ వ్యాప్తంగా పాపులర్ కావాలన్న ఆలోచనలో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
