Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ తొందర పడుతున్నాడా..?

వార్ 2 టీజర్‌ విడుదల తర్వాత హృతిక్‌ రోషన్‌తో పోల్చుతూ ఎన్టీఆర్‌ను కొందరు ట్రోల్‌ చేసిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   4 Jun 2025 3:00 PM IST
ఎన్టీఆర్‌ తొందర పడుతున్నాడా..?
X

బాలీవుడ్‌లో 'వార్‌ 2'తో ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వార్ 2 టీజర్‌ విడుదల తర్వాత హృతిక్‌ రోషన్‌తో పోల్చుతూ ఎన్టీఆర్‌ను కొందరు ట్రోల్‌ చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ లుక్‌, పాత్ర విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ కారణంగా సినిమాకు ఒకింత బజ్ తగ్గిందనే టాక్‌ సైతం వచ్చింది. టీజర్ విడుదల తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సినిమా విడుదల సమయం కు కచ్చితంగా పరిస్థితులు మారుతాయనే అభిప్రాయంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు విడుదల కాబోతున్న ట్రైలర్‌, ఇతర పోస్టర్స్ కారణంగా అంచనాలు మళ్లీ పెరగడం ఖాయం అనే ధీమాతో మేకర్స్ ఉన్నారు.

వార్ 2 సినిమాను నిర్మిస్తున్న యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌తో ఎన్టీఆర్‌ సుదీర్ఘ కాలపు ఒప్పందాలు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ వారు ఒక్కో నటుడితో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని భావిస్తూ ఉంటుంది. అందుకే ఎన్టీఆర్‌తోనూ వీరు పలు సినిమాలకు గాను ముందస్తు ఒప్పందాలు చేసుకుని ఉంటారని తెలుస్తోంది. వార్ 2 హిట్ అయ్యి, ఎన్టీఆర్‌ పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే నమ్మకంతో యశ్ రాజ్‌ ఫిల్మ్స్ వారు ముందుగానే అగ్రిమెంట్‌ చేసుకుని ఉంటారు. సాధారణంగా అయితే వార్ 2 సినిమా విడుదల తర్వాత కొత్త సినిమాను ఎన్టీఆర్‌తో మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ ముందుగానే ఎన్టీఆర్‌తో మరో బాలీవుడ్‌ సినిమాను యశ్‌ రాజ్ ఫిల్మ్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే కమర్షియల్‌ డైరెక్టర్‌గా మంచి పేరున్న ఒక దర్శకుడు ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. ఆ హిందీ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌కి ఎన్టీఆర్‌ సైతం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సింది. మరో వైపు ఒక తెలుగు దర్శకుడు ఎన్టీఆర్‌ హీరోగా యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఒక సినిమాను చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్‌ మరో హిందీ సినిమా ఇదే ఏడాదిలో పట్టాలెక్కే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. వార్‌ 2 విడుదలకు ముందే ఈ చర్చలు జరగడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న వార్‌ 2 సినిమా ఫలితం తేలిన తర్వాత ఎన్టీర్‌ తన తదుపరి హిందీ సినిమా విషయంలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటాడు అనే అభిప్రాయం ఉంది. అయినా కూడా వార్‌ 2 ఫలితం రాకుండానే ఎలా కొత్త స్ఫై థ్రిల్లర్‌కు ఓకే చెప్తాడు, మరో వార్‌ కి గ్రీన్ సిగ్నల్‌ ఎలా ఇస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌ నుంచి వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. డ్రాగన్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి.