ఎన్టీఆర్ బాడీ డబుల్ వార్ 2ను రిజెక్ట్ చేశాడా?
తెరపై కనిపించే హీరోలకు డూప్‌లు అంటే బాడీ డబుల్ లు ఉంటారన్నది చాలా మందికి తెలిసినవిషయమే.
By: Tupaki Desk | 23 April 2025 8:30 AMతెరపై కనిపించే హీరోలకు డూప్‌లు అంటే బాడీ డబుల్ లు ఉంటారన్నది చాలా మందికి తెలిసినవిషయమే. తెరపై వీరోచిత విన్యాసాలు చేసే హీరోలని చూసి అభిమానులు,ప్రేక్షకులు సంబ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. సూపర్ హీరోల్లా అభిమాన హీరోలు చేసే సాహలోపేతమైన విన్యాసాలు, ఒళ్లుగగుర్పొడిచే స్టంట్‌లు మన హీరోలు చేయడం లేదంటే నమ్మడానికి కొంత కష్టంగానే ఉంటుంది కానీ క్లిష్టతమైన స్టంట్‌లు చేసేది మాత్రం హీరోలు కాదు వారి డూప్‌లు అంటే బాడీ డబుల్‌లు.
ప్రతి హీరోకు బాడీ డబుల్ ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ హీరోల వరకు బాడీ డబుల్స్ ఉన్నారు. ప్రతి సినిమాలోనూ, చివరికి కమర్షియల్ యాడ్స్‌లలోనూ హీరోలు చేయలేని స్టంట్స్ చేస్తూ వారికి పేరు తెచ్చి పెడుతున్నారు. అందరి హీరోల్లాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా ఓ డూప్, ఓ బాడీ డబుల్ ఉన్నాడు. అతనే ఈశ్వర్ హరీస్. ఐటీ రంగంలో జాబ్‌ని వదులుకుని గత కొంత కాలంగా ఎన్టీఆర్‌కు బాడీ డబుల్‌గా పని చేస్తూ వస్తున్నాడు.
ఎన్టీఆర్ కోసం వీరోచిత విన్యాసాల్లో కనిపించిన ఈశ్వర్ ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేశాడట. అదే బాలీవుడ్ మూవీ `వార్ 2`. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీల్లోని `వార్`కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ నటిస్తున్న విషయం తెలిసిందే. `బ్రహ్మాస్త్ర` ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ బాడీ డబుల్ తిరస్కరించాడట. కారణం తను డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వకపోవడమేనట.
తను డిమాండ్ చేసిన పారితోషికంతో పాటు ముంబై ఫ్లైట్ ఛార్జీలు కూడా ఇవ్వనన్నారట. దీంతో హర్ట్ అయిన ఈశ్వర్ `వార్ 2`ని తిరస్కరించాడట. మరి అతని స్థానంలో ఎన్టీఆర్ బాడీ డబుల్‌గా ఎవరిని తీసుకున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే `వార్ 2`ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దీని తరువాత ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ క్యూ కడతారని ఇన్ సైడ్ టాక్.