ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ బ్యాడ్ న్యూస్!
స్టార్ హీరో పుట్టిన రోజు వస్తోందంటే అభిమానులు చేసే హడావిడి, నిర్మాణ సంస్థలు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 17 May 2025 12:37 PM ISTస్టార్ హీరో పుట్టిన రోజు వస్తోందంటే అభిమానులు చేసే హడావిడి, నిర్మాణ సంస్థలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. చేస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్, టీజర్ లాంటివి విడుదల చేస్తూ అభిమానుల్ని సంతోషపరుస్తుంటారు. సినిమాకు వాళ్లలో ఉన్న హైప్‌ని మరింతగా పెంచి క్రేజ్‌ని తారా స్థాయికి తీసుకెళుతుంటారు. ఇదే తరహాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 20న భారీ స్థాయిలో జరగనున్నవిషయం తెలిసిందే. ఇదే ఏడాది ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ `వార్ 2`తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. యష్‌రాజ్ ఫిలింస్ పస్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే బారీ అంచనాలు ఏర్పడ్డాయి. హృతిక్ రోషన్, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఎన్టీఆర్ ఇందులో రా ఏజెంట్‌గా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ టీజర్‌లు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని అభిమానులు, సినీ లవర్స్ గత కొన్ని రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ `వార్ 2` టీమ్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌పై హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేయడం, దానికి ఎన్టీఆర్ అంతే చమత్కారంగా రిప్లై ఇవ్వడం తెలిసిందే. శనివారం `వార్ 2` మేకర్స్ కూడా `ఈ పుట్టిన రోజును `వార్ 2`తో సెలబ్రేట్ చేసుకోండి` అంటూ ఎన్టీఆర్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసింది.
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పేశాడు. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `డ్రాగన్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సెట్‌లోకి ఎన్టీఆర్ కూడా ఎంటరయ్యాడు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ సినిమా నుంచి కూడా సర్ ప్రైజింగ్ అప్ డేట్ వస్తుందని, గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తారని అంతా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లిన ప్రశాంత్ నీల్ టీమ్ తాజాగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. గ్లింప్స్‌ను ఇప్పుడు రిలీజ్ చేయడం లేదని, మరో తేదీకి వాయిదా వేశామని వెల్లడించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్నారు. ఆశ పెటం్టి ప్రశాంత్ నీల్ ఇలా బాంబ్ పేల్చాడేంటని వాపోతున్నారు.
