పోస్టర్‌తోనే సునామీ సృష్టించిన ఎన్టీఆర్
ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నాడని ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు.
By: Tupaki Desk | 20 May 2025 12:36 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమేం వస్తాయా అని ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు ముందుగా ఎన్టీఆర్‌నీల్ సినిమా నుంచి ఓ పోస్టర్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఓ పవర్‌ఫుల్ స్టిల్ ను రిలీజ్ చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ ను తెలియచేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నాడని ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ ఇచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉండనున్నాయని కూడా మేకర్స్ ఇప్పటికే చెప్పారు. ఇక పోస్టర్ విషయానికొస్తే ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ సూట్ లో చాలా సన్నగా మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నీల్ నెక్ట్స్ లెవెల్ లో డిజైన్ చేశాడని, ఎన్టీఆర్ ను నీల్ సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడని రిలీజ్ చేసిన పోస్టర్ మరియు చిత్ర యూనిట్ చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది.
వాస్తవానికి మేకర్స్ ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ముందుగా గ్లింప్స్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్2 సినిమా నుంచి గ్లింప్స్ రిలీజవుతున్న సందర్భంగా దీన్ని వాయిదా వేశారు. వార్2 నుంచి గ్లింప్స్ లేకపోతే ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని ఎప్పుడో నీల్ ప్లాన్ చేసుకుని ఓ వీడియోను కూడా కట్ చేయించారని టాక్ వినిపించింది.
రీసెంట్ గానే కర్ణాటకలోని మంగుళూరు దగ్గర ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌నీల్ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తర్వాతి షెడ్యూల్ మొదలుకానుంది.
