ఎన్టీఆర్ బర్త్ డే సర్‌ప్రైజ్‌లివే!
ఈసారి కూడా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం బర్త్ డే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.
By: Tupaki Desk | 6 May 2025 3:34 PM ISTసంవత్సరం మొత్తంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేసే నెల ఏదంటే మే నెలే. దానికి కారణం లేకపోలేదు. మే నెలలో సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుతో పాటూ జూనియర్ పుట్టినరోజు కూడా ఉంది. మే నెల వస్తే తమ అభిమాన హీరోని రెండు సార్లు చూడొచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశ. ఎన్టీఆర్ బర్త్ డే రోజున హైదరాబాద్‌లోనే ఉంటే తన ఇంటిపైకి వచ్చి ఫ్యాన్స్ కు కనిపిస్తాడు. తన తాత ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్తాడు. అలా రెండుసార్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దర్శనమిస్తాడు.
దీంతో పాటూ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన ఫ్యాన్స్ కు ఆయన పని చేస్తున్న సినిమాల నుంచి ఏదొక కంటెంట్ ను రిలీజ్ చేసి ట్రీట్ ఇస్తూ ఉంటాడు. ఈసారి కూడా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కోసం బర్త్ డే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అవి వార్2 తో పాటూ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న వార్2 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ప్రశాంత్ నీల్ సినిమా రీసెంట్ గానే మొదలైంది. ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కు విషెస్ తెలియచేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్-నీల్ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ ను ఆల్రెడీ రెడీ చేశారట. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ తో పాటూ చిన్న వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారట.
వార్2 సినిమా నుంచి కూడా ఎన్టీఆర్ బర్త్ డే కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా బాలీవుడ్ లో హీరోల బర్త్ డేకు ఏమైనా కంటెంట్ ను రిలీజ్ చేయడం చేయరు. కానీ తారక్ కోసం వార్2 టీమ్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈసారి డబుల్ ధమాకా అనే చెప్పాలి.
