Begin typing your search above and press return to search.

తార‌క్ ఊహించ‌ని ట్విస్ట్..నిరాశ‌లో అభిమానులు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంద‌డి నెల‌కొంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు. తార‌క్ పేరిట ర‌క‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు.

By:  Tupaki Desk   |   18 May 2025 12:06 PM
తార‌క్ ఊహించ‌ని ట్విస్ట్..నిరాశ‌లో అభిమానులు!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంద‌డి నెల‌కొంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు. తార‌క్ పేరిట ర‌క‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ప్ర‌తిగా తార‌క్ అభిమానుల‌కు త‌న సినిమాకి సంబంధించి ఏదో అప్ డేట్ ఇచ్చి ఖుషీ చేస్తుంటాడు. ఈసారి కూడా అలాంటి ట్రీట్ లు త‌ప్ప‌క ఉంటాయ‌ని అభిమానులు చాలా ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. కానీ నిరాశ ఎదుర‌య్యేలా ఉంది.

ప్రస్తుతం తార‌క్ హీరోగా `డ్రాగ‌న్` తెర‌కెక్కుతుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై అంచ నాలు భారీగా ఉన్నాయి. తార‌క్ లుక్ ఎలా ఉండ‌బోతుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రివీల్ చేస్తార‌ని అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కానీ డ్రాగ‌న్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వ‌డం లేదు. ప్ర‌తిగా `వార్ 2`తోనే సంబ‌ర ప‌డంటి అంటూ సంకేతాలు పంపేసారు.

`వార్ 2` లో తార‌క్ న‌టించినా అది హిందీ చిత్రం. అందులో తార‌క్ హీరో కూడా కాదు. నెగిటివ్ రోల్ పోషి స్తున్నాడు. త‌న పాత్ర‌కు సంబంధించి ఏదో అప్ డేట్ ఇవ్వ‌నున్నారు. అలాగే `దేవ‌ర 2`కి సంబంధించి కొరటాల శివ అప్డేడ్ ఇస్తాడ‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. స్టోరీకి సంబంధించిన ప‌నుల్లో శివ కొన్ని నెల‌లుగా బిజీగా ఉన్నారు. రెండ‌వ భాగాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

`దేవ‌ర` అంచ‌నాలు అందుకోవ‌డంలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో రెండ‌వ భాగంతో అన్ని లెక్క‌లు స‌రి చేయాల‌ని కొర‌టాల క‌సిమీద ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రి తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అప్డేట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లొచ్చాయి. మ‌రి కొర‌టాల ఇస్తారా? లేదా? అన్న‌ది ఇంత వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.