ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ ఏంటో తెలిస్తే మతి పోవడం ఖాయం..!
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనే కాకుండా హిందీ సినిమా వార్ 2 లోనూ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 5 May 2025 2:19 PM ISTఎన్టీఆర్ బర్త్‌డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్‌డే అంటే అభిమానుల్లో కచ్చితంగా ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇటీవల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి గ్లిమ్స్ రాబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్లుగానే ప్రశాంత్ నీల్ భారీ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. కనుక సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనే కాకుండా హిందీ సినిమా వార్ 2 లోనూ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. వార్ 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తేదీకి విడుదల చేయాలని నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల తేదీ ఎలాగూ దగ్గర పడుతుంది. కనుక ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయాలని నిర్ణయించారు అని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమా నుంచి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా టీజర్‌ను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
వార్ 2 సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా స్థాయిని దాటి ఫ్యాన్స్ అయ్యారు. అందుకే ఈ సినిమా పై అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన వార్ 2 సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా, కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ విలన్‌గా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. త్వరలోనే విడుదల కాబోతున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20న ఫ్యాన్స్ కోసం రెండు సర్‌ప్రైజ్‌లు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కచ్చితంగా భారీ ఎత్తున ఉండే అవకాశాలు ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలను మించి ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో ఎన్టీఆర్ మరింతగా పాపులారిటీని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ తో ఎన్టీఆర్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం.
