నార్త్ వర్సెస్ సౌత్.. పోటీ కన్నా నష్టమే ఎక్కువ..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ డిస్కషన్.. ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 8 April 2025 6:00 AM ISTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ డిస్కషన్.. ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప 1, పుష్ప 2 వంటి అనేక సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటింది. తామేం తక్కువ కాదని పలువురు హీరోలు ప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి.
కానీ వరల్డ్ బాక్సాఫీస్ రిపోర్ట్ పరంగా బాలీవుడ్ హీరోల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అలా అంతా పోటీ ఉంటున్నా.. కొందరు సెలబ్రిటీస్ మాత్రం ఐక్యంగా ఉన్నామని చెబుతుంటారు. కానీ పోటీ క్లియర్ గానే కనిపిస్తుంటోంది. అదే సమయంలో సౌత్ లో ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో అవి రిలీజ్ కానున్నాయి.
బాలీవుడ్ లో కూడా అదే జరుగుతోంది. అయితే అనేక బీటౌన్ సినిమాల మేకర్స్ కొన్ని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. కానీ సౌత్ సినిమాల డౌట్స్ అనౌన్స్ చేశాక తమ మూవీలను తప్పిస్తున్నారు. రీసెంట్ గా పుష్ప-2, ఛావా విషయంలో జరిగింది. రెండూ ఒకేసారి షెడ్యూల్ అయినా ఛావా తప్పుకుంది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ ఇప్పుడు కొన్ని సినిమాల విషయంలో నార్త్ వర్సెస్ సౌత్ నెలకొనేలా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో యష్.. అప్ కమింగ్ మూవీ టాక్సిక్ వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ విడుదల కానుంది. 2026 మార్చి 20వ తేదీన రిలీజ్ అవ్వనుంది.
మరోవైపు, హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్-2 మూవీ ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. ఆ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న కూలీ మూవీ కూడా అప్పుడే విడుదల అవ్వనుంది.
రీసెంట్ గా కూలీ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఇలా పోటీ చెప్పుకోవడానికి బాగున్నా.. నష్టం మాత్రం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే పుష్ప-2, ఛావా రెండూ ఒకేసారి రాకపోవడం వల్ల ఇద్దరికీ లాభం చేకూరిందని చెబుతున్నారు. కాబట్టి మేకర్స్ రిలీజ్ డేట్స్ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు
