Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం.. స్టార్ ఐటమ్ బాంబ్!

ఆ బ్యూటీ మరెవరో కాదు నోరా ఫతేహి. కేనాడు కు చెందిన ఈ గ్లామరస్ డాన్సర్ ఎలాంటి సాంగ్స్ లో అయినా తన స్టెప్పులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేయగలదు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:55 PM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం.. స్టార్ ఐటమ్ బాంబ్!
X

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నెక్స్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ గట్టిగానే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో విశ్వక్సేన్ నెవర్ బిఫోర్ అనేలా ఒక ఊర మాస్ హై వోల్టేజ్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు అలాగే సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.


కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఐటెం సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు నోరా ఫతేహి. కేనాడు కు చెందిన ఈ గ్లామరస్ డాన్సర్ ఎలాంటి సాంగ్స్ లో అయినా తన స్టెప్పులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేయగలదు.

ఆమెకు తెలుగులోనే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసే ఆఫర్ దక్కింది. హిందీలో రోర్: టైగర్స్ ఆఫ్ ద సందర్బన్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే నటిగా మాత్రం ఆమెకు అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపు దక్కలేదు. ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలో మాత్రం స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు దక్కించుకుంటుంది.

ఆమె మొదట పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇక ఆ తర్వాత బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ బాహుబలి లో మనోహరి పాటలో కూడా అబ్బురపరిచింది. ఇక కిక్ 2, లోఫర్ ఊపిరి లాంటి సినిమాల్లో కూడా ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఆమెకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్స్ దక్కింది.

ఈ పాట సినిమాలో చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. నోరపాతి హే గ్లామర్ తో పాటు ఆమె స్టెప్పులు కూడా మతి పోగొట్టేలా ఉంటాయట. ఈ సాంగ్ కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నట్లు టాక్. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ అలాగే సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ప్రతి పాట కూడా సందర్భం సారంగా కథనం ఎలివేట్ చేసే విధంగా ఉంటుందట. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.