వాళ్లిద్దరి మధ్యలో నెల్సన్ దూరుతున్నాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం త్రిముఖ పోరు తప్పదా? ఆ ఇద్దరి మధ్యలో కి మరో సంచలన డైరెక్టర్ రంగం లోకి దిగుతున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 16 Jun 2025 12:00 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం త్రిముఖ పోరు తప్పదా? ఆ ఇద్దరి మధ్యలో కి మరో సంచలన డైరెక్టర్ రంగం లోకి దిగుతున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం తారక్ హీరోగా డ్రాగన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ముగింపులో రిలీజ్ కానుంది. అంతకు వరకూ తారక్ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే అవకాశం లేదు. అయితే తారక్ కోసం ఇప్పటికే ఇద్దరు దర్శకులు క ర్చీప్ వేసారు.
డ్రాగన్ పూర్తయిన వెంటనే `దేవర 2` మొదలు పెట్టాలని కొరటాల శివ సీరియస్ గా పని చేస్తున్నాడు. 'దేవర' డివైడ్ టాక్ రావడంతో ఆ లెక్కలు 'దేవర 2' తో సరి చేయాలని కసి మీద ఉన్నాడు. తనని నమ్మి తారక్ అవకాశం ఇస్తే? ఫలితం తేడాగా రావడంతో ఎలాగైనా ఆ రిమార్క్ చెరుపు కోవాలని చూస్తున్నాడు. కొరటాల లాగే బుచ్చిబాబు కూడా తదుపరి చిత్రాన్ని తారక్ తోనే తీయాలని కసి మీద ఉన్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా తీస్తున్నా? ఆ సినిమా ని వీలైనంత త్వరగా పూర్తి చేసి తారక్ స్క్రిప్ట్ పై పని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే బుచ్చిబాబుకు తారక్ రూపంలో ఎదురు దెబ్బ తగి లింది. అన్ని అనుకున్నట్లు జరిగితే తారక్ తోనే తన రెండవ సినిమా సెట్స్ లో ఉండాలి. కానీ చివరి నిమిషంలో స్క్రిప్ట్ కుదరలేదు. అప్పటి నుంచి తారక్ ను మెప్పించే స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ తోనే తర్వాత సినిమా ఉంటుందని ప్రకటన కూడా చేసాడు. సరిగ్గా ఇప్ప డు వీళ్లిద్దరి మధ్యలోకి తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేరాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా దిలీప్` జైలర్ 2` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం తారక్ తోనే తదుపరి సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం. ఇదే నిజమైతే ముగ్గురి మధ్య తారక్ నిర్ణయం తీసుకోవడం సవాల్ గా మారుతుంది.
