Begin typing your search above and press return to search.

టిల్లు కోసమే రాధిక వెయిటింగ్..?

స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి అవకాశాలు రావట్లేదు. ఐతే నేహా శెట్టి తిరిగి ఫాంలోకి రావాలంటే మళ్లీ అమ్మడికి టిల్లు ఛాన్స్ ఇవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   1 May 2025 9:00 AM IST
టిల్లు కోసమే రాధిక వెయిటింగ్..?
X

డీజే టిల్లు సినిమాతో సిద్ధు ఎంత పాపులర్ అయ్యాడో ఆ సినిమా హీరోయిన్ నేహా శెట్టి కూడా క్రేజ్ తెచ్చుకుంది. అంతకుముందు అమ్మడు చేసిన సినిమాలు అంతగా గుర్తింపు తీసుకు రాలేదు కానీ డీజే టిల్లులో చేసిన రాధిక పాత్ర ఆమెను పాపులర్ అయ్యేలా చేశాయి. ఆ సినిమా తర్వాత నేహాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఐతే ఆ సినిమాలు కూడా క్రేజీ సినిమాలే అయినా ఎందుకో అమ్మడికి అవి సక్సెస్ అందించలేకపోయాయి. నేహా శెట్టి మా కా దాస్ విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఫిమేల్ లీడ్ గా చేసింది.

ఆ సినిమాలో ఆమె క్లాసీ లుక్స్ ఇంప్రెస్ చేశాయి. కానీ ఎందుకో అమ్మడికి ఆ తర్వాత ఛాన్స్ లు రాలేదు. ఇక టిల్లు స్క్వేర్ లో కూడా సర్ ప్రైజ్ క్యామియో చేసిన నేహా శెట్టి ఆ సినిమా 100 కోట్లు కొట్టినా కూడా అమ్మడికి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. ఆల్రెడీ హీరోయిన్ గా చేసింది కాబట్టి వేరే రోల్స్ చేసే ఛాన్స్ లేదు. అందుకే నేహా శెట్టి మళ్లీ ఆలోచనలో పడింది.

స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి అవకాశాలు రావట్లేదు. ఐతే నేహా శెట్టి తిరిగి ఫాంలోకి రావాలంటే మళ్లీ అమ్మడికి టిల్లు ఛాన్స్ ఇవ్వాల్సిందే. టిల్లు క్యూబ్ ఎప్పుడు తీసినా నేహా శెట్టికి అందులో ఒక పాత్ర కన్ఫర్మ్ అవుతుంది. ఆ సీక్వెల్ ఎన్ని కథలతో తీసినా ఈ రాధిక పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. నేహా శెట్టి మాత్రమే కాదు టిల్లు స్క్వేర్ లో అనుపమ ఆ రేంజ్ లో రెచ్చిపోయినా కూడా ఆమెకు కూడా పెద్దగా కలిసి రాలేదు.

సిద్ధుకి మాత్రమే టిల్లు స్క్వేర్ విక్టరీ కలిసొచ్చింది. ఐతే అతను కూడా జాక్ తో షాక్ తిన్నాడు. నెక్స్ట్ తెలుసు కదా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి టిల్లు హీరోయిన్స్ పరిస్థితి ఇలా అవ్వడం వెనుక రీజన్ పూర్తిగా టిల్లు డామినేషనే అని చెప్పుకోవచ్చు. నేహా శెట్టి మాత్రం తనకున్న ఆ రాధిక ఇమేజ్ ని తీసేసి వచ్చిన పాత్రలను నచ్చిన కథలను చేయాలని చూస్తుంది. ఐతే అలాంటి అవకాశాల కోసం ఎదురుచూడక తప్పట్లేదు.

మరోపక్క సినిమాలు లేక ఖాళీగా ఉన్న నేహా శెట్టి రకరకాల ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. టిల్లు ఫ్యాన్స్ అంతా కూడా రాధిక చేసే ఈ ఫోటో షూట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.