Begin typing your search above and press return to search.

రాధిక ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌

ఆ సందర్భంగా హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 1:10 PM GMT
రాధిక ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌
X

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమాలో రాధిక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకులకు అభిమాన హీరోయిన్‌ గా మారిపోయింది. చాలా మంది రాధిక అంటూ నేహా శెట్టి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

సోషల్ మీడియాలో నేహా శెట్టికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. డీజే టిల్లు సినిమా లో తెలంగాణ యాసలో మాట్లాడి పక్కింటి పిల్ల అనిపించుకున్న ఈ అమ్మడు ఈసారి ఏపీ ప్రేక్షకులకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేహా శెట్టి తాజా చిత్రం 'బెదురులంక 2012' లో నటించిన విషయం తెల్సిందే.

కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ సందర్భంగా హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆంధ్ర, తెలంగాణ అంటూ వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

నేహా శెట్టి మాట్లాడుతూ... డీజే టిల్లు సినిమా ద్వారా తెలంగాణ ప్రేక్షకులకు చేరువ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమా తో ఏపీ ప్రేక్షకులకు చేరువ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలోని తన పాత్రకు ఆంధ్ర వాళ్లు బాగా కనెక్ట్‌ అవుతారు అంది. ఈ సినిమా కోసం తాను చాలా ఎగ్జైట్‌ గా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొంది.