Begin typing your search above and press return to search.

హీరోయిన్ కి షూటింగ్ లో చుక్కలు చూపించిన డైరెక్టర్!

కొంచెం క‌ష్ట‌మే అయినా నేహాశెట్టి ఆ పాట కోసం త‌న‌వంతు స‌హ‌కారం అందించింది. కానీ ద‌ర్శ‌కుడితో కొన్ని విష‌యాల్లో గొడ‌వ‌ప‌డింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 5:29 AM GMT
హీరోయిన్ కి షూటింగ్ లో చుక్కలు చూపించిన డైరెక్టర్!
X

అవును.. 5 డిగ్రీల కూల్ వాట‌ర్ లో హీరోయిన్ ని ముంచాడు ఆ డైరెక్ట‌ర్. ఓవైపు బాగా చ‌ల్ల‌ని నీరు.. కానీ పాట‌ను చిత్రీక‌రించాలి అంటే హీరోయిన్ ఆ కూలింగ్ నీళ్ల‌లోకి దిగాలి. పైగా నీళ్లలో క్లోరిన్ కూడా ఉందిట‌. ఓవైపు షాట్ తీయ‌డం కోసం త‌న‌ని ఆ నీళ్ల‌లోకి గెంటాలంటే ఇబ్బంది. అందుకే తాను అస‌లు ఆ షాట్ చేయొద్ద‌ని త‌న‌తో అన్నాను అని అంటున్నాడు ఆ డైరెక్ట‌ర్. అయితే ఇక్క‌డ రివ‌ర్స్ సైకాల‌జీ వ‌ర్క‌వుటై, ఆ హీరోయిన్ వెంట‌నే చ‌ల్ల‌ని కొరికే నీళ్ల‌లోకి దిగింది. అస‌లే క్లోరిన్ అందులో క‌లిసి ఉంది కాబ‌ట్టి అది కాళ్ల‌ను అరికాళ్ల‌ను కొరికేస్తుంది. కానీ ఆ పాట చిత్రీక‌ర‌ణ కోసం అవ‌స‌ర‌మైన షాట్స్ కోసం ఎంతో క‌ష్టంగా ఉన్నా స‌హ‌క‌రించింది.

అయితే అప్ప‌టికే నాలుగైదు షాట్లు చిత్రీక‌రించినా ఇంత‌లోనే త‌ట్టుకోలేక స‌ద‌రు హీరోయిన్ బ‌య‌టికి వ‌చ్చేసింద‌ట‌. దీంతో ఆ హీరోయిన్ తో ద‌ర్శ‌కుడు తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. మ‌రో మూడు నాలుగు షాట్లు అయినా తీయాల‌నుకున్నాడ‌ట‌. కానీ కుద‌ర‌లేదు. దీంతో ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు మాట్లాడుకోవ‌డం కూడా మానేశార‌ట‌. ఓవైపు నీళ్ల‌లో షాట్ అద్భుతంగా వ‌చ్చింద‌ని సంతోషించాలా లేక గొడ‌వ‌ల‌య్యాయ‌ని బాధ‌ప‌డాలో తెలియ‌ని స‌న్నివేశంలో ఆ ఇద్ద‌రూ ఉండిపోయార‌ట‌.


అదంతా స‌రే కానీ ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్ ? ఎవ‌రా డైరెక్ట‌ర్ అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. ఆమె నేహాశెట్టి. అత‌డు ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ‌. నిర్మాత ఏం. ఎం ర‌త్నం కుమారుడు అత‌డు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం- నేహాశెట్టి జంట‌గా న‌టిస్తున్న రూల్స్ రాంజ‌న్ చిత్రం కోసం సమ్మోహ‌నుడా.. పాట‌ను చిత్రీక‌రించ‌గా, ఈ పాట‌లో కొన్ని షాట్ల కోసం క‌థానాయిక చ‌లిగిలిగా ఉండే నీళ్ల‌లోకి దిగాల్సి వ‌చ్చింది. కొంచెం క‌ష్ట‌మే అయినా నేహాశెట్టి ఆ పాట కోసం త‌న‌వంతు స‌హ‌కారం అందించింది. కానీ ద‌ర్శ‌కుడితో కొన్ని విష‌యాల్లో గొడ‌వ‌ప‌డింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ కొంత‌కాలం మాట్లాడుకోలేదు. ఈ విష‌యాల‌న్నీ రూల్స్ రాంజ‌న్ ప్ర‌మోష‌న్స్ లో బ‌య‌ట‌ప‌డుతున్నాయ్. రూల్స్ రంజ‌న్ అక్టోబ‌ర్ 6న‌ విడుద‌ల కానుంది.

'రూల్స్ రంజన్' నుండి సమ్మోహనుడా సాంగ్ ని ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయ ఘోషల్ పాడారు. రథినమ్ కృష్ణ, రాంబాబు గోసాల రచించారు. అమ్రిష్ స్వరపరిచారు.

పూర్తి లిరిక్ ఇదిగో:

సమ్మోహనుడా పెద‌విస్తా నీకే

కొంచం కొరుక్కోవా

ఇష్ట సఖుడ నడుమిస్తా నీకే

న‌లుగే పెట్టుకోవా

పచ్చి ప్రాయాలే వెచ్చనైనా

చిలిపి ఊసులాడ వచ్చె

చెమటల్లో తడిసిన దేహం

సుగంధాల గాలి పంచె

చూసీ చూసీ చూసీ

కలువాయి ఉన్నాలే శశివధాన

తీసేయ్ తీసేయ్ తీసేయ్

తెరలే తొలిగించేవా మద‌నా

సమ్మోహనుడా పెద‌విస్తా నీకే

కొంచం కొరుక్కోవా

ఇష్ట సఖుడ నడుమిస్తా నీకే

న‌లుగే పెట్టుకోవా

ఝుమ్మను తుమ్మెద నువ్వైతే

తేనేల సుమమే అవుతా

సందెపొద్దే నువ్వైతే

చల్లని గాలై వీస్తా

సీతాకాలం నువ్వే అయితే

చుట్టే ఉష్ణాన్న‌వుతా

మంచు వర్షం నువ్వే అయితే

నీటి ముత్యాన్నౌతా

న‌న్ను చూసే చూసే చూసే

కలువాయి ఉన్నాలే శశివధాన

తీసేయ్ తీసేయ్ తీసేయ్

తెరలే తొలిగించేవా మధనా

నదిలా కదిలిన ఈధలయాలే

పొంగి ప్రేమ అలలై

ఎదురౌత కడలై

మెత్త మెత్తని హృదయాన్ని

మీసంతో తడమాల

ఇపుడే తొడిమె తుంచి

సుఖమే పంచి ఒకటై పోవాల

నదిలా కదిలిన ఈధలయాలే

పొంగి ప్రేమ అలలై

ఎదురౌత కడలై

మెత్త మెత్తని హృదయాన్ని

మీసంతో తడమాల

ఇపుడే తొడిమె తుంచి

సుఖమే పంచి ఒకటై పోవాల

సమ్మోహనుడా పెద‌విస్తా నీకే

కొంచం కొరుక్కోవా

ఇష్ట సఖుడ నడుమిస్తా నీకే

న‌లుగే పెట్టుకోవా

పచ్చి ప్రాయాలే వెచ్చనైనా

చిలిపి ఊసులాడ వచ్చె

చెమటల్లో తడిసిన దేహం

సుగంధాల గాలి పంచె

చూసీ చూసీ చూసీ

కలువాయి ఉన్నాలే శశివధాన

తీసేయ్ తీసేయ్ తీసేయ్

తెరలే తొలిగించేవా మధనా