Begin typing your search above and press return to search.

నెహా షెట్టీ.. డైమండ్ లాంటి గ్లామర్ డోస్

తెలుగు తెరపై ఆకట్టుకునే అందంతో పాటు స్టైల్ స్టేట్‌మెంట్‌ను మిక్స్ చేస్తూ దూసుకుపోతున్న నెహా షెట్టీ.. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది

By:  Tupaki Desk   |   10 April 2025 10:55 PM IST
నెహా షెట్టీ.. డైమండ్ లాంటి గ్లామర్ డోస్
X

తెలుగు తెరపై ఆకట్టుకునే అందంతో పాటు స్టైల్ స్టేట్‌మెంట్‌ను మిక్స్ చేస్తూ దూసుకుపోతున్న నెహా షెట్టీ.. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. డ్రీమ్‌లా కనిపించే ఓ వైట్ లెహంగా లుక్‌లో నెహా చేసిన అటిట్యూడ్ పాస్.. ఫ్యాషన్ వలయంలో ఉన్నవారిని ఆకట్టుకుంది. ఈ లుక్‌లో ఆమె ‘ఐ వాక్‌డ్ అవుట్ ఆఫ్ ఎ డ్రీమ్ బట్ మేక్ ఇట్ ఫ్యాషన్’ అని క్యాప్షన్ పెట్టింది.

వైట్ లెహంగాలో నెహా షెట్టీ రాయలుక్‌లో బ్యూటీఫుల్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ లుక్‌లో ఆమె ఫోటోలపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. స్పెషల్‌గా ఆమె క్యారిజ్మా, మేకప్‌, జ్యూవెలరీ అన్ని బ్యూటిఫుల్‌గా బ్యాలెన్స్ అయ్యాయి. ప్రత్యేకించి ఆమె ఇచ్చిన ఐ ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫొటోలకు ఎనలేని గ్రేస్ తెచ్చాయి.

నెహా షెట్టీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదటిగా కన్నడ సినిమాల ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తరువాత తెలుగు ఇండస్ట్రీలో డీజే టిల్లు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె గ్లామర్‌తో పాటు ప్రొఫెషనల్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రూల్స్ రంజన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లోనూ నెహా నటనకు మంచి మార్కులు వచ్చాయి.

ఇక నెహా ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ప్రతి ఫొటోషూట్‌లో ఆమె ఎలాంటి స్టైల్ ఎక్స్‌ప్లోర్ చేస్తుందో, ఎలాంటి మూడ్ చూపిస్తుందో అనే విషయాల్లో ఎంతో క్రియేటివ్‌గా ఉంటుంది. ఈ లేటెస్ట్ లెహంగా లుక్‌లోనూ అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. జ్యూవెలరీ డిటైల్స్‌ నుంచి హెయిర్ స్టైల్‌ దాకా ప్రతీ అంశం ఆమె క్లాస్‌ను చూపిస్తుంది.

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెహా షెట్టీ తన కెరీర్‌నే కాదు ఫ్యాషన్ గేమ్‌ను కూడా ఒక డిఫరెంట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నదని చెప్పొచ్చు. ఈ లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌ ‘ప్రిన్సెస్ లుక్’, ‘డ్రీమీ బ్యూటీ’, ‘ఫ్యాషన్ గర్ల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెహా షెట్టీ నుంచి రాబోయే సినిమాలకంటే ముందు, ఆమె ఫొటోషూట్‌ల కోసం ఎదురుచూసే స్థాయికి ఫ్యాన్స్ వెళ్లిపోయారు. మరి ఆమె ఈ అందంతో నెక్స్ట్ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.