నేహా శెట్టి.. ఇంతకంటే హీటెక్కించే లుక్కుంటుందా..
సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 23 April 2025 8:15 AM ISTసౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. 'డీజే టిల్లు' సినిమాలో తన అందం, అభినయం, గ్లామర్ మిక్స్ చేసిన స్టైల్‌తో నేహా ఒక్కసారిగా యువత మనసు దోచుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ఆమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. అలాంటి నేహా తాజాగా మరోసారి తన స్టన్నింగ్ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫోటో షూట్ స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డార్క్ సీక్విన్ లెహంగాలో, స్టైలిష్ బ్లౌజ్‌తో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేస్తోంది నేహా. సూర్యకాంతి కాంతుల్లో ఆమె చర్మ సౌందర్యం మరింత గ్లో ఇచ్చేలా కనిపించగా, మేకప్, జ్యూవెలరీ, లైట్ షేడోలు అన్నీ కలసి మాజిక్‌ను చూపిస్తున్నాయి. ఈ ఫోటోలపై ఇప్పటికే సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఒకదానికొకటి మెరుగు అన్నట్లుగా నేహా పోస్ట్ చేసిన ప్రతి ఫోటోలో మునుపటి కంటే మరింత గ్రేస్, కాంతి కనిపిస్తోంది. ముఖ్యంగా హాఫ్ కవర్ చేసే ట్రాన్స్‌పరెంట్ డూపట్టాతో తీసిన షాట్ మాత్రం ఔరా అనిపించేలా ఉంది. ట్రెండీ లెహంగా మోడర్న్ డిజైన్‌తో, క్లాసిక్ టచ్‌తో మిక్స్ కావడం చూసి ఫ్యాషన్ లవర్స్ ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం నేహా శెట్టి టాలీవుడ్‌లో బిజీగా మారింది. గ్యాప్ తర్వాత మంచి కథలతో, గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్రలతో వెనక్కి తిరిగి చూడకూడదనుకుంటోంది. ఇప్పటికే ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈసారి నటనతో పాటు సోషల్ మీడియాలో తన స్టైలింగ్, ఫోటో షూట్‌లతో కూడా పాపులారిటీ పెంచుకుంటోంది. సినిమాలతోనే కాదు తాజా ఫోటోలతో నేహా తనకున్న గ్రేస్ తో ముగ్ధుల్ని చేయగలదని నిరూపించుకుంది.
