బులుగు సముద్రంలో నేహా శెట్టి బికినీ షో
తెలుగులో ఆకాష్ పూరి `మెహబూబా` చిత్రంలో నటించింది నేహా శెట్టి. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ లో తన అల్లరి పాత్రతో మరింత పాపులరైంది.
By: Tupaki Desk | 13 Jun 2025 9:27 AM ISTతెలుగులో ఆకాష్ పూరి `మెహబూబా` చిత్రంలో నటించింది నేహా శెట్టి. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ లో తన అల్లరి పాత్రతో మరింత పాపులరైంది. నేహా శెట్టి అందచందాలు, నట ప్రతిభకు యూత్ ఫిదా అయిపోయారు. నిజానికి నేహాశెట్టి మంగుళేరు అమ్మాయి. ఈ బ్యూటీ 2014లో తన మోడలింగ్ కెరీర్ ని ప్రారంభించింది. అంతకుముందు మిస్ మంగళూరు అందాల పోటీలో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2015లో మిస్ సౌత్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. మరోసారి తన అసాధారణ అందం , ఆకర్షణతో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మొదటి రన్నరప్‌గా నిలిచింది.
నేహా శెట్టి మోడలింగ్ సహా నటనతోను అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఎం.ఎస్ శ్రీధర్ మార్గదర్శకత్వంలో డ్యాన్సుల్లోను నైపుణ్యం సంపాదించుకుంది. 2016లో విడుదలైన కన్నడ చిత్రం 'ముంగారు మలే 2'లో నందిని పాత్రతో నేహా శెట్టి సినీ ప్రయాణం ప్రారంభమైంది. 2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం 'మెహబూబా'లో నటిగా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
నటిగా బహుముఖ ప్రజ్ఞను పెంపొందించుకునే ప్రయత్నంలో నేహా యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాటక శిక్షణ పొందింది. అటుపై భారతదేశానికి తిరిగి వచ్చి 2021లో విడుదలైన తెలుగు చిత్రం 'గల్లీ రౌడీ'లో మరోసారి తెరను అలంకరించింది. ఇటీవల తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోను తనదైన నటనతో ఆకట్టుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలో నేహా శెట్టి నిరంతర పోస్టులు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. నేహా సముద్ర విహారయాత్రలో ఉన్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ లో నేహా స్టన్నింగ్ బికినీ లుక్స్ తో మతులు చెడగొడుతోంది. బులుగు సముద్రం మధ్యలో నేహా శెట్టి బోట్ షికార్ హృదయాలను గెలుచుకుంటోంది. రన్నింగ్ బోట్ లో స్నేహితులతో పార్టీని ఆస్వాధిస్తూ నేహా ఫోజులిచ్చింది.
