Begin typing your search above and press return to search.

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

సూర్య నటించిన 'సీన్'లో నాస్లెన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సూర్యతో పోల్చడంపై స్పందించిన నాస్లెన్.. ఆయన లెజెండరీ నటుడని, తనను ఆయనతో పోల్చడం సరికాదన్నారు. సూర్య అద్భుతంగా నటించారని, ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. ఈ సినిమాతో నాస్లెన్‌కు తమిళంలో మంచి గుర్తింపు లభించింది.

By:  Tupaki Desk   |   12 Nov 2026 1:46 PM IST
సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా జీత్తు మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `సీన్` ఇటీవ‌లే రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ లో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దీంతో సూర్య కెరీర్ లో హ్యాట్రిక్ న‌మోదైంద‌. ఇందులో సూర్య స‌హా నాస్ల‌న్ పెర్పార్మెన్ కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ సైతం నాస్ల‌న్ న‌ట‌న‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ప్యూచ‌ర్ స్టార్ అంటూ కొనియాడారు. నాస్లెన్ పూర్తి విభిన్నమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు. క్యూట్ లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కన పెట్టి బలమైన పాత్రలో నటించిన నాస్లెన్ నటనకు తమిళ ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా ఓ మీడియా మీట్ లో నాస్లెన్ కు ఓ ఆస‌క్తిక‌ర ప్రశ్న ఎదురైంది. చిత్రంలో నటన పరంగా నువ్వు సూర్య కంటే బాగా చేశావంటూ వస్తున్న ప్రశంసలు..సూర్య‌తో పోలికలపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. నాస్లెన్ ఆ పోలికలను సున్నితంగా తిర‌స్క‌రించారు. సూర్య గారితో తనను పోల్చడం సరికాదని.. ఆయనతో పోలికేంటని న‌వ్వేసారు. ` సూర్య స‌ర్ లెజెండ్. ఆయనతో పోల్చొదు. చిత్రంలో సూర్య సర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎన్నోసార్లు నటనతో తానన‌ని తాను ఎంటో నిరూపించుకున్నారు.

అలాంటి సీనియర్, లెజెండరీ యాక్టర్‌తో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. ఈ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆయన దానిని ఎంత పర్ఫెక్షన్‌తో చేశారో? అందరం చూశాం` అంటూ సూర్యపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే సమయంలో సూర్యతో కలిసి స్క్రీన్ త‌ను పంచుకోవ‌డం..ముఖ్యంగా సూర్యను కొట్టే సన్నివేశంలో నటించడం తనకెలాంటి అనుభూతినిచ్చిందో నాస్లెన్ గుర్తు చేసుకున్నారు. కథ వింటున్నప్పుడు, షూటింగ్ సమయంలోనూ ఎన్నోసార్లు ఆశ్చర్యపోయానని తాను ఎంతో ఆరాధించే నటుడితో కలిసి నటించడం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింద‌న్నారు.

నాస్లెన్ విష‌యానికి వ‌స్తే అత‌డు మ‌ల‌యాళ న‌టుడు. అక్క‌డ చాలా సినిమాల్లో న‌టించాడు. న‌టుడిగా మంచి గుర్తింపు ద‌క్కింది. కానీ సీన్ సినిమాతో సౌత్ ఇండియాలో త‌న ఐడెంటిటీనే మారిపోయింది. ఇదే తమిళ్ లో నాస్లెన్ తొలి చిత్రం. ఈ నేప‌థ్యంలో ఇక‌పై కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు వ‌చ్చే స‌న్నివేశం క‌నిపిస్తుంది. ట్యాలెంటెడ్ న‌టుల్ని వెతికి ప‌ట్టుకోవ‌డం...ప‌ర భాషా న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో టాలీవుడ్ ముందుంటుంది అన్న సంగ‌తి తెలిసిందే.