తల్లిదండ్రులు కాబోతున్న టాలీవుడ్ సెలబ్రిటీ జంట.. ఫోటో షూట్ వైరల్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత రెండు నెలలుగా వరుస శుభవార్తలు అభిమానులను సంతోషపరుస్తున్నాయి.
By: Tupaki Desk | 1 May 2026 11:09 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత రెండు నెలలుగా వరుస శుభవార్తలు అభిమానులను సంతోషపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరు తమ జీవితంలో ప్రమోషన్ పొందుతూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నారు.
అందులో భాగంగానే కొంతమంది హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అలా ప్రముఖ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. గత ఏడాది వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన ఒక టాలీవుడ్ హీరో ఇప్పుడు తండ్రి కాబోతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరో నారా రోహిత్. గత ఏడాది ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ సిరి లెల్లా ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 30 2025న హైదరాబాదులో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సిరిల్లెల ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సిరి లెల్లాకు కుటుంబ సభ్యులు సీమంతం జరిపించినట్టు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ ఫోటోలు, వీడియో చూసిన నె టిజన్స్ నారా రోహిత్ తండ్రి కాబోతున్నాడు.. ప్రముఖ హీరోయిన్ శిరీష లెల్ల తల్లి కాబోతోంది.. బేబీ బంప్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దీనిపై అటు నారా రోహిత్, ఇటు సిరి లెల్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నారా రోహిత్, సిరిల్లెల్ల ప్రతినిధి 2 సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు . అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి సుందరకాండ సినిమాలో కూడా నటించారు. ఇక ప్రస్తుతం నారా రోహిత్ విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇకపోతే సిరి లెల్లా తో పాటు ప్రముఖ హీరోయిన్ రెబా మోనిక జాన్ కూడా తల్లి కాబోతోంది. థాయిలాండ్ బీచ్ లో బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహించి మరీ వాటిని అభిమానులతో పంచుకుంటూ శుభవార్త తెలిపింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజ వరగమన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెబా మౌనిక జాన్ ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్వాతి రెడ్డి పాటతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక చివరిగా తెలుగులో మృత్యుంజయ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది రెబా మోనిక జాన్.
