Begin typing your search above and press return to search.

మనోడే టాప్.. స్ట్రాటజీ అలా ఉంది మరి!

ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ప్రమోషన్స్ కంపల్సరీ. అందులో హీరోలు కచ్చితంగా సందడి చేయాల్సిందే.

By:  Tupaki Desk   |   23 April 2025 3:00 PM IST
Nani and Suriya Gear Up for May 1 Clash with Hit 3 and Retro
X

ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ప్రమోషన్స్ కంపల్సరీ. అందులో హీరోలు కచ్చితంగా సందడి చేయాల్సిందే. అప్పుడే మూవీపై హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య తమ అప్ కమింగ్ చిత్రాల ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. రెండు సినిమాలపై కూడా ఆడియన్స్ లో హోప్స్ ఉన్నాయి.

నాని హిట్-3 థర్డ్ కేసుతో సందడి చేయనుండగా, రెట్రోతో సూర్య థియేటర్లలోకి రానున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఆ రెండు సినిమాలు.. మే 1వ తేదీన విడుదల అవ్వనున్నాయి. అయితే ప్రమోషన్స్ విషయంలో చూసుకుంటే సూర్య కన్నా నాని తన డామినేషన్ చూపిస్తున్నారు. ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన నాని.. ఇప్పుడు బీ టౌన్ లో ఉన్నారు. అక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైమ్ లోనే.. ఇక్కడ కూడా వీడియోస్ బయటకు వస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా నానినే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. నాని ఇంటర్వ్యూల గ్లింప్సే కనిపిస్తున్నాయి.

దీంతో ప్రమోషన్స్ విషయంలో నాని ఓ స్ట్రాటజీ ఫాలో అయినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అది వర్కౌట్ అయిందని చెప్పాలి. మరికొద్ది రోజుల్లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను స్పెషల్ అండ్ గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వగా.. ఇప్పుడు ప్రమోషన్స్ తో మంచి హైప్ నెలకొంది.

అయితే తెలుగులో రెట్రో కన్నా హిట్-3పైనే ఎక్కువ బజ్ ఉంది. ఎందుకంటే సూర్య గత మూవీ కంగువా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత మేకర్స్ రిలీజ్ ట్రైలర్.. అనుకున్నంతలా తెలుగు ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం లేదని అనేక మంది కామెంట్స్ పెట్టారు. అలా అని సినిమాపై ఇప్పుడు మనం జడ్జిమెంట్ ఇవ్వలేం.

కోలీవుడ్ లో ఓకే కానీ.. టాలీవుడ్ లో మాత్రం హైప్ అంతగా లేదని తెలుస్తోంది. అయితే కార్తీక్ సుబ్బరాజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రమోషన్స్ విషయంలో నాని.. హైప్ విషయంలో హిట్-3 చిత్రాలు ముందున్నాయి. మరి రిలీజ్ అయ్యాక రెండు సినిమాలు ఎలాంటి హిట్ అవుతాయో అంతే వేచి చూడాలి.