Begin typing your search above and press return to search.

వార్ 2 మరోసారి నాగ వంశీ కామెంట్స్ వైరల్..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత నాగ వంశీ చేస్తున్న సినిమాలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Dec 2025 2:12 PM IST
వార్ 2 మరోసారి నాగ వంశీ కామెంట్స్ వైరల్..!
X

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత నాగ వంశీ చేస్తున్న సినిమాలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా మీడియం రేంజ్ సినిమాలతో పాటు స్టార్ సినిమాలు కూడా చేస్తూ ఆడియన్స్ ని అలరించే సినిమాలు చేస్తున్నారు నాగ వంశీ. ఐతే 2025 తనకు పెద్దగా కలిసి రాలేదని అంటున్నారు ఆయన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ 2025 ఫస్ట్ హాఫ్ డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ ఓకే కానీ సెకండ్ హాఫ్ లాసులు వచ్చాయని అన్నారు.

వార్ 2 సినిమా గురించి..

ఇదే క్రమంలో వార్ 2 సినిమా గురించి ప్రస్తావించారు నాగ వంశీ. వార్ 2 సినిమాను 68 కోట్లను కొన్నాను ఆ సినిమా 40 కోట్లు వసూలు చేసింది. సినిమా వర్క్ అవుట్ అవ్వలేదని ఆ నిర్మాణ సంస్థ 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. దాని వల్ల తనకు మరీ అంత లాస్ ఏమి రాలేదని అన్నారు నాగ వంశీ. అదే కాదు ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి అసలేమి బాగాలేదని.. ఉన్న బయ్యర్స్ ని కాపాడుకోవాలని అన్నారు.

అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో కలెక్షన్ పోస్టర్స్ ఇక వద్దని అంటున్నారు నాగ వంశీ. పోస్టర్స్ మీద 300, 500 కోట్లు అని అంటే ఆ మొత్తం నిర్మాతకే వస్తున్నాయన్న ఆలోచనలో ఆడియన్స్ ఉన్నారని.. అంత కలెక్షన్స్ వస్తున్నప్పుడు మళ్లీ టికెట్ రేట్లు పెంచడం ఎందుకని అడుగుతున్నారని అన్నారు నాగ వంశీ.

అనగనగా ఒకరాజు సినిమా లేడీస్ టైలర్..

అంతేకాదు సినిమాలను పైరసీ చేసి సైట్ లో పెట్టే వాళ్లను హీరోలు చేస్తున్నారని కూడా ఐబొమ్మ రవి ఇష్యూపై స్పందించారు నాగ వంశీ. సంక్రాంతికి రాబోతున్న అనగనగా ఒక రాజు సినిమా రాజేంద్ర ప్రసాద్ వంశీ గారి లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లాంటి సరదా సినిమాగా ఉంటుందని. నవీన్ పొలిశెట్టి తనదైన శైలిలో ఆడియన్స్ ని మెప్పిస్తారని అన్నారు నాగ వంశీ. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ తన బ్యానర్ లో లాసులు వచ్చాయని.. అందుకే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాకు త్రివిక్రం తో డిస్కస్ చేసి సినిమాను వదులుతున్నామని అన్నారు నాగ వంశీ.

తన మీద సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ ని తాను అసలు పట్టించుకోనని.. మంచి సినిమాలు తీసి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేయడమే తన పని అన్నారు నాగ వంశీ.