Begin typing your search above and press return to search.

తారక్ 'హ్యాట్రిక్ లోడింగ్'.. నాగవంశీ అనౌన్స్మెంట్ వీడియో వేరే లెవల్!

అయితే ఇప్పుడు వార్-2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకోవడం విశేషం.

By:  Tupaki Desk   |   5 July 2025 1:11 PM IST
తారక్ హ్యాట్రిక్ లోడింగ్.. నాగవంశీ అనౌన్స్మెంట్ వీడియో వేరే లెవల్!
X

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అదే సమయంలో తన బాలీవుడ్ డెబ్యూ వార్-2తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో తారక్ నటిస్తున్న వార్-2ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తన యూనివర్స్ లో భాగంగా రూపొందిస్తున్న ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

అయితే ఇప్పుడు వార్-2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకోవడం విశేషం. ఈ మేరకు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. తాజాగా నిర్మాత, సితార సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ప్రకటించారు. దాంతోపాటు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

'హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. విధ్వంసం సృష్టించనున్న వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ ను దక్కించుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది. ఆగస్టు 14వ తేదీ నుంచి థియేటర్లలో పండగ షురూ కానుంది' అంటూ రాసుకొచ్చారు నాగవంశీ. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ, దేవర రైట్స్ ను ఆయనే కొన్నారు.

అప్పట్లో ఆ రెండు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వార్-2 హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు వీడియోలో అదే అర్థం వచ్చేలా తెలిపారు. వీడియో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. అరవింద సమేత వీర రాఘవ, దేవర, వార్-2 పోస్టర్స్ తో ఉన్న గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.

కాగా, వార్-2 తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ ఉందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అనేక మంది నిర్మాతలు పోటీ పడినట్లు టాక్ వినిపించింది. కానీ భారీ ధరకు నాగవంశీ ఇప్పుడు దక్కించుకున్నారని తెలుస్తోంది. అయితే స్పై థ్రిల్లర్‌ యాక్షన్ జానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న వార్-2 ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.