Begin typing your search above and press return to search.

వీడియో : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని జంట

తాజాగా అక్కినేని జంట నాగ చైతన్య, శోభితల వీడియో వైరల్ అయింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో వీరిద్దరు కనిపించారు.

By:  Tupaki Desk   |   26 May 2025 4:02 PM IST
వీడియో : ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని జంట
X

సెలబ్రిటీల ఎయిర్‌ పోర్ట్‌ వీడియోలు, ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ తారల ఎయిర్‌ పోర్ట్‌ వీడియోలు, ఫోటోలు మాత్రమే సోషల్‌ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు సౌత్‌ స్టార్స్ ఎయిర్‌ జర్నీ ఫోటోలు సైతం తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అక్కినేని జంట నాగ చైతన్య, శోభితల వీడియో వైరల్ అయింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో వీరిద్దరు కనిపించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న ఈ వీడియోలో అక్కినేని జంటను చూసి చాలా మంది ఫ్యాన్స్‌తో పాటు, సోషల్‌ మీడియా జనాలు తెగ లైక్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా ఉన్న వీరిద్దరి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

సినిమాల షూటింగ్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే నాగ చైతన్య, శోభిత తాజాగా కాస్త బ్రేక్‌ తీసుకుని విహార యాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌ పోర్ట్‌లో ఎప్పటిలాగే నాగ చైతన్య సింపుల్‌ అండ్‌ హ్యాడ్సమ్‌ లుక్‌లో కనిపించాడు. వైట్‌ టీ షర్ట్‌ ధరించి, బ్లాక్ పాయింట్‌ ధరించడం ద్వారా కూల్‌గా కనిపిస్తున్నాడు. ఇక శోభిత స్టైలిష్ లుక్‌లో కనిపించింది. స్టైలిష్ గాగుల్స్ ధరించడం ద్వారా అందరి చూపు తన వైపుకు తిప్పుకుంది. అంతే కాకుండా ఆమె ఔట్ ఫిట్‌ కూడా చాలా ట్రెండీగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ జీన్స్‌లో ఆమె నడుస్తూ ఉంటే స్టైల్‌ ఐకాన్‌ నడిచినట్లు అనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్య, శోభిత పెళ్లి తర్వాత చాలా సార్లు ఇలా ఎయిర్‌ పోర్ట్‌లో, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించారు. అయినా కూడా ఇదే మొదటి సారి అన్నట్లుగా మీడియా వారు వీరిని ఫోటోలు తీసేందుకు గాను తెగ ఎగబడ్డారు. ఇద్దరు అలా ఎయిర్‌ పోర్ట్‌లో కలిసి లోనికి వెళ్లే వరకు అభిమానులు, మీడియా వారు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. వీరికి ఉన్న క్రేజ్‌కి ఇదే సాక్ష్యం. సోషల్‌ మీడియాలో శోభిత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. నాగ చైతన్య కాస్త సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు. అయితే శోభిత మాత్రం రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా అభిమానులకు చేరువగా ఉంటాడు.

ఇటీవల తండేల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగ చైతన్య మరో బ్లాక్ బస్టర్‌ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో చైతూ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది. మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకునేందుకు గాను నాగ చైతన్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో చేసే సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే కచ్చితంగా సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.