నాటు నాటు స్ఫూర్తితో ఈ రెండూ..!
ఇప్పుడు అదే యష్ రాజ్ బ్యానర్ లో రూపొందుతున్న 'ఆల్ఫా'లోను ఒక స్పెషల్ సాంగ్ ఉంది.
By: Tupaki Desk | 26 Jun 2025 9:00 AM ISTఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లో 'నాటు నాటు..' వరల్డ్ ఫేమస్ అయింది. ఇది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సహా గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లోను పురస్కారం దక్కించుకుంది. ముఖ్యంగా ఇది ఒక మాస్ గీతం. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీపడి నర్తించారు. దీనికోసం చాలా రిహార్సల్స్ కూడా చేసారు. నిజానికి ఆర్.ఆర్.ఆర్ మొత్తం ఒకెత్తు అనుకుంటే, నాటు నాటు ఒక్కటీ ఒకెత్తు.
అయితే ఇటీవల ఓ రెండు సినిమాల్లో నాటు నాటు తరహా క్రేజ్ కోసం ప్రత్యేక గీతాల్ని చిత్రీకరించడం హాట్ టాపిగ్గా మారింది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు యష్ రాజ్ ఫిలింస్ సంస్థలో రూపొందుతున్నాయి. హృతిక్ - ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 పై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో నువ్వా నేనా? అంటూ పోటీపడే ఒక ప్రత్యేక గీతంలో హృతిక్- యంగ్ టైగర్ డ్యాన్సులు మెరిపించబోతున్నాయి. హృతిక్ బాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ సౌతం సౌతిండియాలో ఉత్తమ డ్యాన్సర్ గా గుర్తింపు పొందాడు. అందుకే ఈ కలయిక సర్వత్రా ఆసక్తిని పెంచింది.
ఇప్పుడు అదే యష్ రాజ్ బ్యానర్ లో రూపొందుతున్న 'ఆల్ఫా'లోను ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆలియా భట్, శార్వరి వాఘ్ ఈ పాటలో కనిపిస్తారు. గ్లామరస్ క్వీన్స్ ఒకరితో ఒకరు పోటీపడుతూ అభినయించనున్నారు. ఇటీవలే ఈ పాటను కూడా చిత్రీకరించారు. ఆసక్తికరంగా ఆలియా - శార్వరి ఒకరితో ఒకరు పోటీపడుతూ రిహార్సల్స్ కూడా చేసారు. మొత్తానికి ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య పోటీకి సంబంధించి కొన్ని సీన్లు, డ్యాన్స్ సీక్వెల్స్ చూడటానికి అభిమానులు వేచి ఉండలేరు. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2 విడుదలవుతుంది. ఆ తర్వాత లేడీ స్పై సినిమా ఆల్ఫా విడుదలవుతుంది.
