Begin typing your search above and press return to search.

సీత‌మ్మ జీవితాన్నే మార్చేసిన ఘ‌ట‌న‌!

అనుకోకుండా ఓ రోజు ఓ స్నేహితురాలు మ‌రాఠీ షో ఆడిష‌న్ గురించి చెప్ప‌డంతో అక్క‌డ పాల్గొందిట‌. మ‌రాఠీ మాతృ భాష కావ‌డంతో పెర్పార్మెన్స్ తో ఇర‌గ‌దీసింద‌ట‌.

By:  Tupaki Desk   |   11 May 2025 4:00 PM IST
సీత‌మ్మ జీవితాన్నే మార్చేసిన ఘ‌ట‌న‌!
X

మృణాల్ ఠాకూర్ అలియాస్ స‌తీమ కెరీర్ దేదీప్య‌మానంగ సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. 'సీతారామం' స‌క్సెస్ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చినా? వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో ఒక్క‌సారిగా బిజీ అయింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే ఐదారు సినిమాలు చేస్తోంది. ఇందులో 'డెకాయిట్' చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ తెర‌కెక్కి స్తున్నారు. తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్నా? క‌థ‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో అంగీక‌రించ‌డం లేదు.

అలా చాలా ప్రాజెక్టులే వ‌దులుకుంది. పారితోషికంతో ప‌నిలేకుండా కేవ‌లం క‌థాబ‌లం...స‌వాల్ విసిరే పాత్ర‌లే కావాలం టోంది. క‌థ‌ల విష‌యంలో అంత బ‌లంగా నిల‌బ‌డింది కాబ‌ట్టే స‌క్సెస్ లు అందుకుం టుంది. అయితే న‌టిగా ఇంత బిజీ అవ్వ‌డానికి కార‌ణ‌మైన కెరీర్ మూలాల‌ను మృణాల్ మ‌రోసారి గుర్తు చేసుకుంది. న‌ట‌న ప‌ట్ల త‌న‌కు ఉత్సాహం ఉన్నా? దాన్ని ఎలా ఆచ‌ర‌ణ‌లో పెట్టాలో తెలియ‌క చాలా ఇబ్బంది ప‌డిందిట‌.

త‌న క‌ల‌ను ఎలా స్వీక‌రిస్తారో తెలియ‌క త‌న‌లో ఫ్యాష‌న్ ను గురించి ఎప్పుడూ కుటుంబ స‌భ్యుల‌తో పంచు కోలేదుట‌. అనుకోకుండా ఓ రోజు ఓ స్నేహితురాలు మ‌రాఠీ షో ఆడిష‌న్ గురించి చెప్ప‌డంతో అక్క‌డ పాల్గొందిట‌. మ‌రాఠీ మాతృ భాష కావ‌డంతో పెర్పార్మెన్స్ తో ఇర‌గ‌దీసింద‌ట‌. ఆ సక్సెస్ ఓపాత్ర‌ను తెచ్చి పెట్టిందంది. న‌ట‌న ప్ర‌యాణంలో తొలి అడుగు ప‌డేలా చేసిందంది.

కెరీర్ లో ఎంతో మంది ప్రేక్ష‌కుల ప్రేమ‌ను పొంద‌డానికి కార‌ణ‌మైన ఆ క్ష‌ణాలు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మ‌ని గుర్తు చేసుకుంది. మృణాల్ తొలు మ‌రాఠీలో 'హ‌లో నందన్' అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్ల‌కు ల‌వ్ సోనియాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగులో సీతారామంతో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.