Begin typing your search above and press return to search.

ఆ ఒక్క స్టెప్ తో విశ్వక్, ఆయేష ఊపేశారుగా!

అఘోర శంకర్ రోల్ లో నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు.

By:  Tupaki Desk   |   23 March 2024 8:25 PM GMT
ఆ ఒక్క స్టెప్ తో విశ్వక్, ఆయేష ఊపేశారుగా!
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది దాస్ కా ధమ్కీతో సూపర్ హిట్ కొట్టిన విశ్వక్.. ఇటీవల గామితో వచ్చి క్లీన్ హిట్ అందుకున్నారు. అఘోర శంకర్ రోల్ లో నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఇక త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో థియేటర్లలోకి రానున్నారు. వేసవి కానుకగా మే 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

గోదావరి బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విశ్వక్.. గోదావరి కుర్రాడిగా నటిస్తున్నారు. మాస్ లుక్ లో గోదావరి యాసతో అలరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. విశ్వక్ మాస్ యాక్షన్ ను చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీలో ఐటెం సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఆ పాటకు చిందులేయనున్నట్లు వార్తలు వచ్చినా.. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఆ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మోత పాటను హోలీ పండుగ కానుకగా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విశ్వక్, ఆయేష మాస్ ఔట్ ఫిట్స్ తో అదరగొట్టారు.

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేకర్స్ మరో అప్డేట్ తో వచ్చారు. మోత సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటోంది. యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోనుందని అర్థమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ అండ్ కొరియోగ్రఫీ కూడా కేక పుట్టించేలా ఉన్నాయి. ప్రోమోలో ఒక్క స్టెప్ తోనే విశ్వక్, ఆయేష.. సాంగ్ పై మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

ప్లెయిన్ చొక్కా, లుంగీతో విశ్వక్ ఉండగా.. ఆయేషా ఖాన్ పొట్టి డ్రెస్ లో ఘాటుగా దుమ్ముదులిపేసింది. మొత్తానికి ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఈ సాంగ్ కు ఆస్కార్ విన్నింగ్ గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాట ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది మూవీ యూనిట్. మరి విశ్వక్, ఆయేషా ఖాన్ మోగించిన మోత ఎలా ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.