Begin typing your search above and press return to search.

కన్నప్ప అందుకు ఒక నిదర్శనం : మోహన్ బాబు

మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పీచ్ ప్రేక్షకులను అలరించింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:25 AM IST
కన్నప్ప అందుకు ఒక నిదర్శనం : మోహన్ బాబు
X

మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పీచ్ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే అది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్లే మన చేతుల్లో ఏమి లేదని అన్నారు మోహన్ బాబు. మన జీవితంలో ప్రతి కదలిక భగవంతుడి నిర్ణయమే.. రెండు సినిమాలు హిట్ కాగానే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్ స్ట్రుమెంటల్ మాత్రమే అని అన్నారు.

ఆ భగవంతుడి ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే మనం ముందుకెళ్తామని అన్నారు. కనప్ప సినిమా ఎలా తీశామని అందరు చెప్పారు. ఒక మంచి సినిమా తీశాం అందుకు భగవంతుడి ఆశీస్సులతో పాటు విష్ణుకి మీ ఆశీస్సులు ఉండాలని అన్నారు మోహన్ బాబు. ఈ సినిమా కోసం విష్ణు ఎంతో కష్టపడ్డాడు. ఏం చేయాలో అది చేశాడు. అతని బాధ్యత అతను చేశాడు. ఇక ఈ సినిమాలో అందరు హీరోలే శరత్ కుమార్, డైరెక్టర్ ముఖేష్ తో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ ఇలా అందరు హీరోలే. వాళ్లు అందించిన సపోర్ట్ చాలా గొప్పది. ఒక్కొక్కరు 10 రోజులు షూటింగ్ అంటే 20 రోజులు న్యూజిలాండ్ లో ఉన్నారని అన్నారు మోహన్ బాబు.

కన్నప్ప సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందించారు మోహన్ బాబు. ఇక డైరెక్టర్ ముఖేష్ తీసిన మహాభారతం సీరియల్ ను 10, 15 సాలు చూశాను. అతను ఒక గొప్ప దర్శకుడని అన్నారు మోహన్ బాబు. ఇక ఈ వేడుకకు గిరిజన ప్రముఖులను పిలిచి సత్కరించిన మోహన్ బాబు తిన్నడు బోయ కులానికి చెందిన వాడు.. అతనొక ఆదివాసి అతను కన్నప్పగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ. అది ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచామని అన్నారు మోహన్ బాబు.

మంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప సినిమాకు స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.