Begin typing your search above and press return to search.

'వార్ 2' కోసం మ‌ళ్లీ అర‌వింద స‌మేత సీన్ రిపీట్‌!

జ‌క్క‌న్న తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ RRR`. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ దేశ వ్యాప్తం అయింది.

By:  Tupaki Desk   |   14 April 2025 12:12 PM IST
NTR Going Shirtless For War 2!
X

జ‌క్క‌న్న తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ RRR`. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ దేశ వ్యాప్తం అయింది. కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ ప‌లికించిన హావ భావాల‌కు, క‌ళ్ల‌తో ప‌లికించిన న‌ట‌న‌కుగానూ యావ‌త్ దేశం మొత్తం ఫిదా అయింది. అంతే కాకుండా బాలీవుడ్ మేక‌ర్స్‌తో పాటు స్టార్స్ కూడా ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. అందులో భాగంగానే ఎన్టీఆర్‌కు `వార్ 2`లో న‌టించే క్రేజీ ఆఫ‌ర్ ద‌క్క‌డం తెలిసిందే. `వార్‌`కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీలో హృతిక్ రోష‌న్ కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

య‌ష్‌రాజ్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. తొలి సారి ఎన్టీఆర్ న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ కావ‌డంతో ద‌క్షిణాది ప్రేక్ష‌కులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ ద‌శ నుంచి వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. దీనికి తోడు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ ఈ ప్రాజెక్ట్‌పై హీరో హృతిక్ రోష‌న్ హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు.

`బ్ర‌హ్మాస్త్ర‌` ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఈ ఏడాది ఆగ‌స్టు 14న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తొలి సారి ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని, ఆ క్యారెక్ట‌ర్ హృతిక్‌ని మించి ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దీనికిపై టీమ్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఇదే నిజ‌మ‌ని అంతా భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇప్ప‌టికే ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు తారా స్థాయికి చేర‌డంతో సౌత్‌లోనూ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చి చ‌క్క‌ర్లు కొడుతోంది. `అర‌వింద స‌మేత‌` ఓపెనింగ్ సీన్‌లో ఎన్టీఆర్ ష‌ర్ట్ లేకుండా న‌టించి కేక‌పుట్టించిన విష‌యం తెలిసిందే. `వార్ 2`లోనూ ఆ ఫీట్‌ని రిపీట్ చేసి ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించ‌నున్నాడ‌ట‌. సినిమాలో 10 నుంచి 20 నిమిషాల పాటు ఎన్టీఆర్ ష‌ర్ట్ లేకుండా క‌నిపిస్తాడ‌ట.

ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంద‌ని, ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఎన్టీఆర్ ష‌ర్ట్ లేకుండా క‌నిపించి ఫ్యాన్స్‌కి ఐఫీస్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించ‌నున్న ఈ యాక్ష‌న్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.