Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ గుండె నిండిపోయింది

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి ముందుగా చిరంజీవి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:40 AM GMT
మెగా ఫ్యాన్స్ గుండె నిండిపోయింది
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ఇప్పుడు పవర్ పిల్లర్ గా మారాడు. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. టీడీపీ, బీజేపీని దగ్గర చేసి కూటమి కట్టడం ద్వారానే ఈ స్థాయిలో అఖండ మెజారిటీ వారికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రస్తావిస్తున్నారు. ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారాడని జాతీయ మీడియా ఛానల్స్ సైతం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏమీ ఎన్డీయే కూటమి గెలుపులో కీలకం అయిన పవన్ కళ్యాణ్ కి జాతీయ స్థాయిలో గొప్ప గౌరవం దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కలిసి ప్రత్యేకంగా అకిరా నందన్ ని అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ తో కొద్ది సేపు ముచ్చటించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నీరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి ముందుగా చిరంజీవి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ఆశీర్వదించడమే కాకుండా ఆప్యాయంగా కౌంగిలించుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తల్లి అంజన దేవి ఆశీర్వాదం కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. కుటుంబం మొత్తం ఆనందోత్సవాలతో పవన్ కళ్యాణ్ గెలుపుని వేడుకగా చేసుకుంది. ఈ వీడియోని మెగా, పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ దగ్గరుండి అన్ని చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తిరిగి వెళ్ళిపోయినపుడు కారు డోర్ ఓపెన్ చేసి బాబాయ్ కి సెండాఫ్ ఇచ్చారు.

మెగా ఫ్యామిలీ అన్యోన్యతకి ఈ వీడియో నిదర్శనం అని, అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలి అంటూ వీడియోని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మీడియా ఛానల్స్ కూడా ఈ వీడియోని ప్రత్యేకంగా టెలికాస్ చేయడం విశేషం. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా తమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటూ ట్విట్టర్ లోషేర్ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది.