ఆయన కళ్లకే కాదు..మనిషికి వీరాభిమానే!
కోలీవుడ్ స్టార్ సూర్యకి సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎంతో మంది అభిమానులున్నారు.
By: Tupaki Desk | 6 July 2025 1:00 AM ISTకోలీవుడ్ స్టార్ సూర్యకి సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎంతో మంది అభిమానులున్నారు. అందులో కొందరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సూర్య నటన, హావభావాలంటే ఎంతో ఇష్టపడతారు. పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, రామ్ చరణ్ కూడా సూర్య అభిమానులే. సూర్య కళ్లంటే ఆ ఇద్దరు హీరోలకు ఎంతో ఇష్టం. సూర్య కళ్లతో నటిస్తారని ఇద్దరు కామన్ గా చెబుతుంటారు. అలాగే విజయ్ దేవరకొండ సహా చాలా మంది హీరోలు సూర్య నటనకు అభిమానులే.
ఇక సూర్యకి లేడీస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించైతే చెప్పా ల్సిన పనిలేదు. 'గజినీ' దగ్గర నుంచి ఆ ఫాలోయింగ్ అలాగే కొనసాగుతుంది. ఇసుమెత్తు కూడా సూర్య ఫాలోయింగ్ గాళ్స్లో ఎక్కడా తగ్గలేదు. చాలా మంది హీరోయిన్లు సైతం సూర్య అభిమానులే. అందులో నేను ఒకరంటూ ముందుకొచ్చింది మలయాళ బ్యూటీ మీనాక్షి దినేష్. `కోలీవుడ్ లో సూర్యకి వీరాభిమానిని. ఆయన నటనను చాలా కాలంగా చూస్తున్నాను.
పాత్రకు తగ్గట్టు ఎంతో గొప్ప గా మౌల్డ్ అవుతారు. నటన పరంగా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సూర్యకి జోడీగా నటించాలన్నది నా కల. నాలా కలలు కనే వారు ఇంకా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ల కన్నా ముందుగా నాకే ఆయనతో నటించే అవకాశం రావాలని కోరుకుంటాను. సూర్య కళ్లు అంటేనే కాదు...ఆయన అంటేనే అభిమానం. ప్రేమ` అంటూ తెలిపింది. ఈ బ్యూటీ తెలుగులోనూ పరిచయమ వుతుంది. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నిర్మిస్తోంది. ఈ అమ్మడు మాలీవుడ్ లో `18ప్లస్`, `రెట్టా` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అమ్మడికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ బ్యూ టీ మాత్రం తమిళ, తెలుగు చిత్రాలపై ఆసక్తిగా ఉంది. ఈ అమ్మడు కూడా నేచురల్ బ్యూటీగా నెట్టింట బాగా వైరల్ అవుతుంది.