Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్ : అతడి బర్త్‌ డే వేడుకలో ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ముంబైలో 'వార్‌ 2' షూటింగ్‌ లో జాయిన్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   20 April 2024 11:12 AM GMT
క్లిక్‌ క్లిక్ : అతడి బర్త్‌ డే వేడుకలో ఎన్టీఆర్‌
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ముంబైలో 'వార్‌ 2' షూటింగ్‌ లో జాయిన్ అయ్యాడు. ఇప్పటికే హృతిక్‌ రోషన్ వార్‌ 2 షూట్‌ లో జాయిన్ అయ్యాడు. తాజాగా ఎన్టీఆర్‌ కూడా వార్‌ 2 షూటింగ్‌ కు జాయిన్‌ అయ్యాడంటూ కన్ఫర్మ్‌ అయ్యింది. మొన్నటి వరకు దేవర షూటింగ్‌ లో ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు వార్‌ 2 కోసం యాక్షన్‌ సీన్స్ చేస్తున్నాడు.


వార్‌ 2 షూటింగ్ కోసం ముంబైలో ఉన్న ఎన్టీఆర్‌ షూటింగ్‌ గ్యాప్‌ లో తన ఫిట్‌నెస్ ట్రైనర్‌ మన్నవ్‌ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నాడు. మన్నవ్‌ తో ఎన్టీఆర్‌ కేక్‌ కట్‌ చేయించాడు. మన్నవ్‌ బర్త్‌ డే సెలబ్రేషన్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొన్న ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎన్టీఆర్‌ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తన పక్కన ఉన్న వారికి కుటుంబ సభ్యుల మాదిరిగా గౌరవ మర్యాదలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలా తనకు చాలా కాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌ గా ఉన్న మన్నవ్‌ యొక్క పుట్టిన రోజును ఎన్టీఆర్‌ స్వయంగా జరపడం విశేషం.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే.. దేవర సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత వార్‌ 2 మొదలు పెట్టాలి అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల ముందే వార్ 2 ను షురూ చేయాల్సి వచ్చింది. ఈ నెల చివరి వరకు ఎన్టీఆర్‌ ముంబైలోనే వార్‌ 2 షూట్‌ లో పాల్గొంటాడు.

వచ్చే నెలలో మళ్లీ దేవర సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్‌ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్‌ లో విడుదల కాబోతున్న దేవర సినిమా షూట్ ను జూన్‌ లేదా జులై వరకు పూర్తి చేసే విధంగా కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ కు జోడీగా దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.