Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్.. ఫ్రెండ్స్ అంతా అలెర్ట్ చేశారుగా!

అయితే మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్ అయిన వెంటనే ఆమె ఫ్రెండ్స్, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, నేహా శెట్టి.. అలర్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   18 April 2025 6:49 PM
మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్.. ఫ్రెండ్స్ అంతా అలెర్ట్ చేశారుగా!
X

కొంతకాలంగా సైబర్ మోసాలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారు కేటుగాళ్లు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు అకౌంట్ హ్యాక్ అయిందని, డబ్బులు పంపొద్దని ఎందరో పెడుతున్న పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి.

రీసెంట్ గా నటి మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. వెంటనే ఆమె ఇన్ స్టా వాల్ లో ట్రేడింగ్ కు సంబంధించిన పోస్టులు కనిపించాయి. యాప్‌ లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, తాను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నానని ఇన్ స్టా స్టోరీలో హ్యాకర్లు రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే మంచు లక్ష్మి అకౌంట్ హ్యాక్ అయిన వెంటనే ఆమె ఫ్రెండ్స్, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, నేహా శెట్టి.. అలర్ట్ చేశారు. మంచు లక్ష్మి ఇన్‌ స్టాగ్రామ్ హ్యాక్ అయిందని తెలిపారు. దయచేసి ఎవరూ కూడా డబ్బులు పంపకండంటూ తమ సోషల్ మీడియాలో స్టోరీస్ పెట్టారు. వారిద్దరితోపాటు మరికొందరు సెలబ్రిటీలూ పోస్టులు పెట్టి అప్రమత్తం చేశారు.

మరోవైపు, మంచు లక్ష్మి కూడా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని తెలిపారు. ముఖ్యంగా డబ్బులు కావాలని అడిగితే ఎవరూ స్పందించవద్దని చెప్పారు. తనకు ఒకవేళ డబ్బులు అవసరం అయితే డైరెక్ట్ అడుగుతానని, కానీ ఇలా సోషల్ మీడియాలో అడగనని చెప్పుకొచ్చారు.

తన ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు మంచు లక్ష్మి. అన్నీ సెట్ అయితే మళ్లీ చెబుతానని అన్నారు. అయితే మంచు లక్ష్మి నిరంతరం తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. అందుకే హ్యాకర్లకు టార్గెట్ అయ్యారని అంతా అంటున్నారు.

అయితే టీచ్ ఫర్ చేంజ్ కోసం లక్ష్మి.. ర్యాంప్ వాక్ షోలో పాల్గొని వార్తల్లో నిలిచిన కొద్దిసేపటికే ఆమె అకౌంట్ హ్యాక్ అవ్వడం గమనార్హం. త్వరలోనే తన అకౌంట్ సెట్ అవుతుందని మంచు లక్ష్మి రీసెంట్ గా తెలిపారు. ఊహించని విధంగా ఆమె అకౌంట్ హ్యాక్ అవ్వడంతో సెలబ్రిటీలు, మంచు లక్ష్మి స్నేహితులు మద్దతు తెలుపుతూనే ఉన్నారు.