Begin typing your search above and press return to search.

ప్రేమలు బ్యూటీ ఖాతాలో మరోటి..!

ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసులు గెలిచేసింది క్యూట్ బ్యూటీ మమితా బైజు.

By:  Tupaki Desk   |   23 May 2025 8:03 PM IST
Mamitha Baiju Telugu Multiple projects
X

ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసులు గెలిచేసింది క్యూట్ బ్యూటీ మమితా బైజు. ఆ సినిమాకు ముందు కూడా అమ్మడు మలయాళంలో సినిమాలు చేసినా కూడా ప్రేమలు సినిమానే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. కేవలం మలయాళంలోనే కాదు ఆ సినిమా రిలీజైన ప్రతి చోటా అమ్మడికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. యూత్ ఆడియన్స్ అయితే మమితా నామ జపం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి మమితా హా**ట్ ఫేవరెట్ అయ్యింది. టాలెంట్ ఉన్న వాళ్లకు తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చోటిస్తారు. ఒక్కసారి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైతే దూరమవడం చాలా కష్టం.

ప్రేమలు లాంటి డబ్బింగ్ సినిమాతోనే మమిత తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఐతే యూత్ లో ఆమెకు ఉన్న బజ్ చూసి మన మేకర్స్ మమితా బైజుని ఇక్కడ సినిమాల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఐతే ఇప్పటికే తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న మమితా తెలుగు దర్శక నిర్మాతల ఆఫర్లను కాదనేసింది.

ఐతే సూర్య వెంకీ అట్లూరి చేస్తున్న సినిమాలో మాత్రం మమితా ఛాన్స్ అందుకుంది. అది తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ గా వస్తుంది కాబట్టి మమితా మొదటి తెలుగు సినిమా అదే అని ఫిక్స్ అవ్వొచ్చు. ఇదిలాఉంటే ఇలా సూర్య సినిమా ఓకే చేసిందో లేదో మమితాకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని టాక్. స్టార్ సినిమాలో ఆమెకు అవకాశం దక్కిందట. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని అయినా సినిమాలు చేయాలి కానీ రిజెక్ట్ చేస్తూ పోతే తర్వాత కావాలన్నప్పుడు అవకాశాలు దొరకవని మమితా కి తెలిసి వచ్చింది.

అందుకే సూర్య సినిమా ఇలా ముహూర్తం పెట్టగానే మరో తెలుగు సినిమా ఆఫర్ రాగా అది కూడా ఓకే చేసింది. ఇప్పటికే అమ్మడు మైత్రి మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ తో చేస్తున్న డ్యూడ్ సినిమాలో ఛాన్స్ అందుకోగా ముచ్చటగా మూడో ఆఫర్ కూడా కొట్టేసిందని తెలుస్తుంది. మొత్తానికి మమితా బైజు మీద ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు తెలుగు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. డ్యూడ్ తో పాటు సూర్య సినిమా రిలీజ్ అయ్యే సరికి మమితా ఇక్కడ టాప్ రేంజ్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. ఆల్రెడీ త్వరలో ప్రేమలు 2 తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన మమితా ఈ సినిమాలన్నీ కూడా ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ తెప్పించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.