లిప్ కిస్ తో మధుబాల అసౌకర్యంగా!
పెదవి ముద్దులంటే ఇప్పుడు సర్వసాధారణం. దాదాపు హీరోయిన్లు అంతా ఎలాంటి అడ్డుచెప్పకుండా నటిస్తున్నారు. ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ అంతో ఓపెన్ గా నటిస్తున్నారు.
By: Tupaki Desk | 14 Jun 2025 10:00 PM ISTపెదవి ముద్దులంటే ఇప్పుడు సర్వసాధారణం. దాదాపు హీరోయిన్లు అంతా ఎలాంటి అడ్డుచెప్పకుండా నటిస్తున్నారు. ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ అంతో ఓపెన్ గా నటిస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చే ఏ నటి అయినా ఇలాంటి సన్నివేశాల్లో నటించడం సహజంగా మారింది. సన్నివేశం రక్తికట్టాలంటే ఆ మాత్రం సాహసించనిదే పనవ్వదు దర్శకులు రాజీకి రావడం లేదు. ఈ విషయంలో పాత తరం దర్శకులు కూడా తక్కువేం కాదు.
సీన్ విషయంలో అప్పటి డైరెక్టర్లు కూడా ఎక్కడా రాజీ పడేవారు కాదు. అలా ఓ ముద్దు సీన్ విషయంలో అలనాటి అందాల హీరోయిన్ మధుబాల లాక్ అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇండస్ట్రీకి వచ్చే ముదే షరత్తులు పెట్టుకునే వచ్చానని..కానీ వచ్చిన తర్వాత ఓ సందర్భంలో ఆ రూల్ ని బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు.
స్కిన్ షోలు..ముద్దు సన్నివేశాల్లో నటించడం తనకు ఎంత మాత్రం ఇష్టముండదన్నారు. ఇలా నటించని కారణంగా చాలా సినిమాలు వదులుకున్నట్లు తెలిపారు. అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత ముద్దు సన్నివేశంలో నటించాలని చెప్పారు. 'అందుకు నేను అంగీకరించలేదు. కానీ అక్కడ ఆ సీన్ చాలా ముఖ్యమైని టీమ్ పట్టుబట్టింది.
దీంతో నేను కూడా కాదనలేకపోయాను. తెగించి ముద్దు సీన్ లో నటించాను. అలా నటించడం నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది. చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. తీరా సినిమా రిలీజ్ తర్వాత ఆ సీన్ లేదు. ఎడింటింగ్ లో తీసేసారు. అలాగని నేనెళ్లి దర్శకుడితో గొడవ పెట్టుకోలేదు. సినిమా కోసం ఎలాంటి సన్నివేశంలోనైనా నటించాలని సీనియర్లను చూసాక అర్దమైంది. బాలీవుడ్ లో చాలా అవకాశాలు వచ్చినా కండీషన్లు బ్రేక్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో అవకాశం వదులుకున్నట్లు' తెలిపారు.
