Begin typing your search above and press return to search.

వార‌సుడి క‌ఠినమైన టైమింగ్స్‌ శిక్ష‌ణ‌పై మ్యాడీ

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అందుకున్న మ్యాడీ త‌న వార‌సుడి గురించిన కొన్ని క‌ఠిన విష‌యాల‌ను అభిమానుల కోసం షేర్ చేసారు

By:  Tupaki Desk   |   16 July 2025 11:10 PM IST
వార‌సుడి క‌ఠినమైన టైమింగ్స్‌ శిక్ష‌ణ‌పై మ్యాడీ
X

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అందుకున్న మ్యాడీ త‌న వార‌సుడి గురించిన కొన్ని క‌ఠిన విష‌యాల‌ను అభిమానుల కోసం షేర్ చేసారు. తాజాగా `జీక్యూ` ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న కుమారుడు వేదాంత్‌తో పోలిస్తే తాను చాలా సోమ‌రిని అని అన్నారు మ్యాడీ. అత‌డు వేకువ ఝామున బ్ర‌హ్మ ముహూర్తంలో (4ఏఎం) నిదుర లేచి క‌ఠిన‌మైన వ్యాయామ, ఆహార నియ‌మాల‌ను పాటిస్తాడ‌ని, నిదుర స‌మ‌యాన్ని కూడా చాలా క‌రెక్టుగా మెయింటెయిన్ చేస్తాడ‌ని మాధ‌వ‌న్ తెలిపారు.

ఒక ప్రొఫెషనల్ ఈతగాడిగా వేదాంత్ డే 8పీఎం ముగుస్తుంది. ఆపై అతడు మళ్ళీ 4 ఏఎం మేల్కొంటాడు. ఇది అతడికి మాత్రమే కాకుండా అతడి తల్లిదండ్రులకు కూడా ఉద్యోగంలో అత్యంత డిమాండ్ ఉన్న భాగం. ఆ గంటను బ్రహ్మ ముహూర్తం అంటారు. మేల్కొనడానికి ఆధ్యాత్మికంగా అనుకూలమైన సమయం అని చెబుతారు.. వేదాంత్ 6 అడుగుల 3 ఇంచీల ఎత్తు ఉంటాడు. అతి క్రమశిక్షణ కలిగిన జీవనశైలిని అనుసరిస్తాడు. తినడం కూడా అతనికి ఒక వ్యాయామం. అతను విందు కోసం కూర్చోడు. నమలడం, భోజన సమతుల్యతపై దృష్టి పెడ‌తాడు.. అని మాధ‌వ‌న్ తెలిపాడు.

తన కొడుకుతో పోల్చినప్పుడు తనను తాను సోమరి అని మ్యాడీ అభివ‌ర్ణించాడు. నాకు అలాంటి క్రమశిక్షణ ఉంటే బాగుండును.. నేను నిజానికి చాలా సోమరిని.. నేను క్రియేట‌ర్ ని అని చెప్పుకోవడం ద్వారా దాని నుండి తప్పించుకుంటాను.. అని చెప్పారు. మాధ‌వ‌న్ కుమారుడు స్విమ్మింగ్ కాంపిటీష‌న్ లో చాలా బ‌హుమ‌తుల్ని గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో అత‌డు రాణిస్తుండ‌డం గ‌ర్వ కార‌ణం. మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్నారు.