'రోలెక్స్' ఎప్పుడో లోకేష్ చెప్పేశాడు!
ఈ నేపథ్యంలోనే ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూలో లోకేష్ కనగరాజ్ 'రోలెక్స్' ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 3 May 2025 2:00 AM ISTకోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు యంగ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో విలక్షణ కథ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా భారీ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. `కూలీ` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని సన్ పిక్చర్పస్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, రెబామోనిక జాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్‌ల తొలి కలయికలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. కమల్‌కు 'విక్రమ్'తో బ్లాక్ బస్టర్‌ని అందించినట్టుగానే లోకేష్ `కూలీ`తో రజనీకి అంతకు మించిన బ్లాస్టింగ్ హిట్‌ని అందిస్తాడని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. రజనీతో తొలిసారి చేసిన సినిమా కావడంతో లోకేష్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూలో లోకేష్ కనగరాజ్ 'రోలెక్స్' ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూర్యతో ప్రాజెక్ట్ గురించి ఎదురైన ప్రశ్నకు లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. 'ఖచ్చితంగా 'రోలెక్స్' ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే అది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందన్నది చెప్పలేను. సూర్య సర్ కమిట్‌మెంట్‌లు ఉన్నాయి. నేనూ కమిట్ అయిన సినిమాలున్నాయి. త్వరలో 'ఖైది 2' చేయబోతున్నాను. మా ఇద్దరి కమిట్‌మెంట్‌లు పూర్తయ్యాక 'రోలెక్స్'ని ఎప్పుడు మొదలు పెట్టాలన్నది ఆలోచిస్తాం. అయితే 'రోలెక్స్' మాత్రం ఖచ్చితంగా ఉంటుంది' అని స్పష్టతనిచ్చారు.
