Begin typing your search above and press return to search.

ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది!

ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ చేస్తున్న కూలీ మాత్రం మళ్లీ ఆయన్ను ఫాం లోకి తీసుకొస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2025 6:30 AM IST
ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది!
X

కోలీవుడ్ లో వరుస హిట్లతో సెన్సేషన్ గా మారిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఖైదీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అతను ఎప్పుడైతే విక్రం సినిమా తీశాడు అప్పుడు అతని డైరెక్షన్ టాలెంట్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. తెలుగులో కూడా లోకేష్ డైరెక్షన్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. విక్రం తర్వాత చేసిన ప్రయత్నాలేవి ఆయన మార్క్ అందుకోలేదు. లియో అయితే అసలు లోకేష్ ఎందుకు ఇలా చేశాడని అనిపించింది.

ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ చేస్తున్న కూలీ మాత్రం మళ్లీ ఆయన్ను ఫాం లోకి తీసుకొస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సూపర్ హిట్ అనిపించుకుంటుంది. రజినీ కూడా కూలీ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లోకేష్ లియో గాడి తప్పింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆయన ఇలాంటి తప్పిదాలు చేయకూడదు.

ఐతే కూలీతో మళ్లీ లోకేష్ తన ఒరిజినల్ ట్రాక్ లోకి వస్తాడని అంటున్నారు. అసలే కోలీవుడ్ పరిశ్రమ వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉంది. సో లోకేష్ లాంటి డైరెక్టర్ సూపర్ స్టార్ లాంటి హీరోతో చేస్తున్న కూలీ వల్ల ఇండస్ట్రీకి లాభం చేకూరాలి. అలా కాకుండా ఈ సినిమా కూడా నిరాశ పరిస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది.

పరిశ్రమ సంగతి అటుంచితే ఖైదీ, మాస్టర్, విక్రం, లియో ఇలా లోకేష్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటాడని అనుకుంటే కాస్త గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నాడు. కూలీతో లోకేష్ అసలు సిసలు స్టామినా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే రజినీ లాంటి హీరోతో లోకేష్ లాంటి డైరెక్టర్ కాంబో అంటే అది ఆటం బాంబ్ లాంటిది అలాంటి కాంబినేషన్ సినిమా బ్లాస్ట్ అవ్వాలి కానీ తుస్సుమనకూడదు.

మరి లోకేష్ కూలీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సూపర్ స్టార్ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. ఆగష్టు 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పోటీగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన వార్ 2 పోటీకి దిగుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అన్నది చూడాలి. వార్ 2 సినిమాను కూడా సౌత్ లో తారక్ ఉన్నాడు కాబట్టి భారీగా ప్రమోట్ చేస్తున్నారు. సో వార్ 2 ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.