కొరటాల సంగతేంటి? దేవర-2 ఎప్పుడు?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆయన.. రీసెంట్ గా దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
By: Tupaki Desk | 15 April 2025 1:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆయన.. రీసెంట్ గా దేవర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఆ చిత్రం.. పాన్ ఇండియా లెవెల్ లో అలరించింది.
అయితే దేవర తర్వాత ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు కొరటాల శివ. దేవరకు సీక్వెల్ ఉందని ప్రకటించినా.. అది స్టార్ట్ అవ్వడానికి రెండు మూడేళ్ల టైమ్ కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తారక్.. వార్-2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వార్-2 మూవీకి గాను తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసేశారు.
ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. నీల్ మూవీ తర్వాత నెల్సన్ తో తారక్ చేతులు కలుపుతారని టాక్ వినిపించింది. కానీ రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో దేవర-2 కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.
దీంతో ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత తారక్.. దేవర-2 చేయనున్నారని తెలుస్తోంది. అందుకే ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయాలని కొరటాలకు సూచించారట. అందుకు కాస్త టైమ్ పడుతుందనే చెప్పాలి. దీంతో దేవర-2 స్టార్ట్ అయ్యే లోపు మరో హీరోతో కొరటాల వర్క్ చేస్తారా లేదా స్క్రిప్ట్ వర్క్ తో బిజీ అయిపోతారన్నది క్వశ్చన్ మార్క్.
అదే సమయంలో టాలీవుడ్ బడా హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. రెండు సెట్స్ పై ఉండగా.. మరో రెండు త్వరలో స్టార్ట్ కానున్నాయి. మహేష్ బాబు.. రాజమౌళి మూవీలో నటిస్తున్నారు. అటు అల్లు అర్జున్ అట్లీతో కమిట్ అవ్వగా.. ఇటు రామ్ చరణ్ పెద్ది మూవీలో నటిస్తున్నారు.
నాని, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, నాగచైతన్య సహా పలువురు హీరోలు కూడా తమ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. దీంతో ఇప్పుడు కొరటాల ఏం చేస్తారన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. మరి కొరటాల తారక్ కోసం వెయిట్ చేస్తారా.. ఇంకెవరైనా హీరోను రంగంలోకి దించుతారా అనేది చూడాలి.